Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యంగ్ వైఫ్‌తో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఏజ్డ్ స్టార్! (ఫోటోస్)
బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ 52 ఏళ్ల వయసులో 25 ఏళ్లు కూడా పూర్తిగా నిండని యంగ్ బ్యూటీ అంకింత కోన్వర్ని ప్రేమ వివాహం చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఎంజయ్ చేస్తోంది నూతన జంట. పెళ్లయిన వెంటనే మిలింద్-అంకిత హనీమూన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా వీరి రొమాన్స్‌కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అండర్ వాటర్ రొమాన్స్
మిలింద్ సోమన్, అంకింత కోన్వర్ అండర్ వాటర్ రొమాన్స్ చేస్తున్న ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను అంకిత కోన్వర్ స్వయంగా విడుదల చేశారు. తన భర్త ముసలోడు కాదు... సత్తా ఉన్నోడు అని అందరికీ చెప్పేందుకే ఆమె ఈ ఫోటోలు పోస్టు చేసినట్లు చర్చించుకుంటున్నారు.
ఫస్ట్ టైమ్ అండర్ వాటర్
ఫస్ట్ టైమ్ తన లేడీ లవ్‌తో కలిసి అండర్ వాటర్ పీట్ చేస్తున్నట్లు వెల్లడించిన మిలింద్ సోమన్... తన భార్యతో కలిసి దిగిన ఓ క్లోజప్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
నాలుగేళ్ల నుండి ప్రేమాయణం
మిలింద్ సోమన్, అంకింత కోన్వర్ గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ముంబైలో ఇద్దరూ కొంతకాలం కలిసి సహజీవనం చేశారు. మిలింద్ వయసు ఎక్కువైనా తన ఇంట్లో వారిని ఈ పెళ్లికి ఒప్పించి సక్సెస్ అయింది అకింత.
అలా పరిచయం
అకింత కోన్వర్ ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలో పని చేస్తూ చెన్నైలో ఉన్నపుడు... ఓ నైట్ క్లబ్లో మిలింద్ కళ్లలో పడింది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకున్న మిలింద్ ఆమెతో మాటలు కలిపి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. అలా ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారి, సహజీవనం, ఆపై పెళ్లి వరకు వచ్చింది.
అందరినీ ఆశ్చర్య పరిచారు
52 ఏళ్ల వయసున్న మిలింద్ సోమన్ పాతికేళ్లు కూడా నిండని అమ్మాయిని ఎలా ప్రేమలో పడేశాడు? అని అంతా ఆశ్చర్యపోయారు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ముంబైలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.