సెల్ఫీ అడిగిన పాపానికి నడిరోడ్డు మీద ఆ పని చేయించాడు...నటుడి మీద నెటిజన్ల ఫైర్!
ఇండియన్ టాప్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ బాలీవుడ్ లో అందరికీ సుపరిచితమే. 53 సంవత్సరాలున్న ఆయన యంగ్ మోడల్ అంకిత కొన్వర్ ను పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే అంకిత వయసు 28 ఏళ్లు. మూడేళ్ళ క్రితం తన వయసులో సగం వయసున్న అమ్మాయిని పెళ్లాడి చర్చనీయాంశంగా మారాడు. అప్పటి నుంచి అనేక ఎప్పటికప్పుడు వివాదాస్పద అంశాల్లో వార్తల్లోకి ఎక్కుతున్న ఆయన మరోసారి నెటిజన్లకి టార్గెట్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే

ఫిట్నెస్ ఫ్రీక్
మోడల్ మరియు నటుడు మిలింద్ సోమన్ ఫిట్నెస్ ఫ్రీక్, ఆయన తరచుగా తన సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం సూత్రాలు పంచుతూ ఫిట్నెస్ను ప్రోత్సహిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించుకోమని చెబుతూ ఉంటాడు. వారితో కొన్ని ఫిట్నెస్ చిట్కాలు పంచుకుంటూ ఉంటాడు కూడా. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు, కానీ నెటిజన్లు ఆ వీడియో విషయంలో సంతోషంగా లేరు.

పాత వీడియో
తాజాగా నటుడు తన సోషల్ మీడియా వేదికగా పాత వీడియోస్ పంచుకున్నాడు, ఆ వీడియోలో చీర ధరించిన మహిళ పుషప్‌లు చేస్తూ ఉండడం కనిపించింది. అయితే పుషప్‌లు చేయడం బాగానే ఉంది కానీ అలా రోడ్డు మీద చేయడం జనానికి నచ్చలేదు. అందుకు తగ్గట్టు సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె ఎక్కడున్నాను ? ఏమి ధరించాను అనే విషయం కూడా పట్టించుకోకుండా ఆ మహిళ పుషప్‌లు చేసింది. ఆ తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు.

రోడ్డు మీదే దుకాణం
ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని పేర్కొన్నాడు. నేను రాయ్‌పూర్‌లో ఉన్న ఒక చిన్న స్ట్రీట్ వీధి మార్కెట్‌లో ఉన్నాను, అక్కడ కొన్ని స్థానిక చిరు తిళ్ళు తింటున్నానని, ఆ సమయంలోనే ఈ లేడీ సెల్ఫీ కోరిందని అన్నారు. తాను 10 పుషప్‌లు చేస్తే సెల్ఫీ ఇస్తానని చెప్పడంతో ఆమె వెంటనే రంగంలోకి దిగి కెమెరా ఆన్ చేయడానికి ముందే పుషప్‌లు చేయడం ప్రారంభించిందని అన్నారు.

చీర గురించి కూడా ఆలోచించకుండా
ఆమె ధరించిన చీరతో గురించి ఆలోచించలేదు, చుట్టుపక్కల వ్యక్తుల గురించి ఆలోచించలేదు, ఎప్పుడూ పుషప్‌లు చేయలేదని ఆలోచించలేదు అని చెప్పుకొచ్చారు. ఇక మీకు కావాల్సిన వస్తువులను పొందడానికి ఇలాంటి వాటి గురించి ఏమీ ఆలోచించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆమె పుషప్‌లు చేసిన వెంటనే ఆమె సొంత ఫోన్‌లో మంచి సెల్ఫీ తీసుకున్నానని పేర్కొంది.
Recommended Video
ఉద్దేశ్యం మంచిదే కానీ
ఉద్దేశ్యం మంచిదే అయినా చాలా మంది ఇది కొంచెం అతిగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ, "ఫిట్‌నెస్ కోసం పుష్-అప్‌లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుష్-అప్‌లు చేయించడం బాలేదని అన్నారు. మరో నెటిజన్ ఆమె శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదని కామెంట్ చేశారు .


Click it and Unblock the Notifications











