33 ఏళ్ల భార్యతో 60 ఏళ్ల హీరో సరసాలు... ఆ వయసులోనూ ఆమెతో కసిగా!
ప్రేమకు, పెళ్లికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదని కొన్ని జంటలు నిరూపిస్తుంటాయి. 70 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడి ఆమెతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కోవలోకే వస్తారు మిలింద్ సోమన్. 60 ఏళ్ల వయసులోనూ నవ మన్మథుడిలా మెరిసిపోవడంతో పాటు సరసాలు ఆడుతూ కుర్రాళ్లను మించి రెచ్చిపోతున్నారు. తాజాగా భార్యతో బీచ్‌లో ఆయన రెచ్చిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
1965 నవంబర్ 4న స్కాట్లాండ్‌లో పుట్టారు మిలింద్ సోమన్... ఆ తర్వాత వీరి కుటుంబం ముంబైకి వలస వచ్చింది. పదేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో వాలంటీర్‌గా పనిచేసిన ఆయన ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేశారు. తొలుత 1995లో మేడ్ ఇన్ ఇండియా అనే మ్యూజిక్ వీడియోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిలింద్ సోమన్ ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. మౌత్ ఫుల్ ఆఫ్ స్కై, మార్గరిటా, నూర్జహాన్, ఇండియాస్ నెక్ట్స్ టాప్ మోడల్, పౌరుషపూర్, మసాబా మసాబా, ది రాయల్స్ తదితర సీరియల్స్‌లో నటించారు.

తొలుత బుల్లితెరపై ఎంట్రీ
2000వ సంవత్సరంలో తారికిబ్ అనే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన మిలింద్ సోమన్.. ఆ తర్వాత 16 డిసెంబర్, అగ్ని వర్ష, భాగమతి, వాలీ ఆఫ్ ఫ్లవర్స్, కటుపుట్లి, షాడోవ్, పైయా, నక్షత్ర డాక్టర్, వన్ ఫ్రైడే నైట్, బాజీరావు మస్తానీ, స్టార్ ఫిష్, చెఫ్.. ఈ ఏడాది ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటించారు. తెలుగులోనూ డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన సత్యమేవ జయతే చిత్రంలో నటించారు మిలింద్. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీతో పాటు ఇంగ్లీష్, జపనీస్, స్వీడిష్ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు.
అథ్లెట్‌గానూ రికార్డులు
నటుడిగా, మోడల్‌గా, నిర్మాతగానే కాకుండా ఆయన ప్రొఫెషనల్ స్విమ్మర్, అథ్లెట్ కూడా. మహారాష్ట్రతో పాటు భారత జాతీయ జట్టుకు స్విమ్మింగ్‌లో ప్రాతినిధ్యం వహించారు మిలింద్. 1984లో జరిగిన ఆసియా గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. అలాగే రన్నింగ్‌లో 1500 కిలోమీటర్ల దూరాన్ని 30 రోజుల్లో ఛేదించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. బెర్లిన్ మారథాన్‌లో 42.2 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 32 నిమిషాల్లో ఫినిష్ చేశాడు.
అందగత్తెలతో ఎఫెర్స్
సినిమాలు, క్రీడలతో పాటు మిలింద్ సోమన్ తన పర్సనల్ లైఫ్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతని కెరీర్‌లో చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్, ప్రేమాయణం సాగించాడు. తొలుత ఫ్రెంచ్ నటి మైలిన్ జంపానోయిని పెళ్లాడాడు మిలింద్. ఆమె అతని కంటే 15 ఏళ్లు చిన్నది. వీరిద్దరూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సెట్‌లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే మనస్పర్ధలు రావడంతో మిలింద్ - మైలిన్‌లు 2009లో విడాకులు తీసుకున్నారు.
కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి
మైలిన్‌తో విడాకుల తర్వాత మిలింద్ పలువురు టాప్ మోడల్స్, హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. వీరిలో మధు సప్రే, షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో 2018లో కూతురు వయసున్న అంకితా కున్వర్‌ను పెళ్లాడటం విమర్శలకు దారితీసింది. పెళ్లి సమయానికి అంకిత వయసు కేవలం 26 ఏళ్లే. ఈమెతో సోమన్ ఎన్నాళ్లు కలిసుంటాడోనని అంతా భావించారు.. కానీ పెళ్లయి ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ జంట హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తోంది.
60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా
అంకిత క్యాబిన్ క్రూలో పనిచేసేది. మిలింద్‌తో పెళ్లి తర్వాత ఆమె తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరూ తరచుగా ట్రావెలింగ్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేకాదు.. భార్యతో క్లోజ్‌గా ఉంటూ రొమాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోను కూడా ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా మిలింద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ జంట ఓ బీచ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా అంకితను అమాంతం పైకి లేపి భుజాలపై పడుకోబెట్టుకున్నాడు మిలింద్. ఈ ఫోటోలలో మిలింద్ .. ఓ షార్ట్‌పై టవల్ చుట్టుకుని జిమ్ బాడీతో బట్టలు లేకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా 60 ఏళ్ల వయసులోనూ ఇంత బాగా బాడీ మెయింటైన్ చేస్తున్నారంటూ మిలింద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











