నాతో ఆ హీరో ఆ విధంగా చీటింగ్.. అలా టెంప్ట్ చేసి.. బాలీవుడ్‌ తారల గుట్టరట్టు చేసిన హీరోయిన్

సినీ పరిశ్రమలో తమకు జరిగిన చేదు అనుభవాలను సినీ తారలు బయటపెడుతున్నారు. ప్రముఖ నటి నీనా గుప్తా తన ఆత్మకథలో క్యాస్టింగ్ కౌచ్ విషయాలను వెల్లడించిన తర్వాత చాలా మంది కుర్ర హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను, తమ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను మీడియాకు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా తన చేదు అనుభవాలను చెబుతున్న మినీషా లాంబా తనకు ఓ హీరోతో జరిగిన అన్యాయాలను వెల్లడిస్తూ...

భర్తకు విడాకులు ఇచ్చి...

భర్తకు విడాకులు ఇచ్చి...

మినీషా లాంబా విషయానికి వస్తే.. ఇటీవల తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తకు విడాకులు ఇచ్చారు. ర్యాన్ థామ్ అనే రెస్టారెంట్ బిజినెస్ చేసే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత వారి మధ్య దాంపత్య జీవితానికి సంబంధించిన అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకొన్నారు.

పెళ్లికి ముందు బాలీవుడ్ హీరోతో డేటింగ్

పెళ్లికి ముందు బాలీవుడ్ హీరోతో డేటింగ్

అయితే ర్యాన్ థామ్‌తో పెళ్లికి ముందు ఒక హీరోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అతడి పర్సనాలిటీ చూసి మోసపోయాను. రిలేషన్‌లోకి దిగిన తర్వాత అతడు మాటలతో బోల్తా కొట్టిస్తాడనే విషయాన్ని గ్రహించారు. అతడి తీరుతో దూరంగా ఉండటంతో నాతో బ్రేకప్ చేసుకొన్నాడు. అతడితో బ్రేకప్ తర్వాత నేను చాలా ప్రేమను పొందాను అని మినీషా లాంబా తెలిపింది.

ఇండస్ట్రీ వారితో నో డేటింగ్

ఇండస్ట్రీ వారితో నో డేటింగ్

బాలీవుడ్ హీరోతో బ్రేకప్, భర్తతో విడాకుల తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకొన్నాను. సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారితో నేను డేటింగ్ చేయవద్దని డిసైడ్ అయ్యాను. ముఖ్యంగా యాక్టర్లతో అఫైర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే వారు చాలా టెంప్ట్ చేస్తారు. అంతకంటే నేను ఎక్కువగా ఏమీ చెప్పలేను అని మినీషా లాంబా పేర్కొన్నది

ఎవరి ఇష్టం వారిది అంటూ...

ఎవరి ఇష్టం వారిది అంటూ...

ఫిలిం ఇండస్ట్రీలో నాకు తెలిసి యాక్టర్లతో హీరోయిన్లు డేటింగ్, అఫైర్లు కొనసాగిస్తున్నారు. యాక్టర్లతో డేటింగ్ చేయవద్దని నేను చెప్పడం బాగుండదు. ఎందుకంటే ఒకరిని హర్ట్ చేసినట్టు అవుతుంది. డేటింగ్ అనేది ఒకరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేయాలనేది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నా విషయంలో అలాంటి నిర్ణయం తీసుకొన్నాను అని మినీషా లాంబా పేర్కొన్నది.

అఫైర్ రూమర్లను ఖండించిన హీరోయిన్

అఫైర్ రూమర్లను ఖండించిన హీరోయిన్

భర్త ర్యాన్ థామ్‌తో విడాకుల తర్వాత మరో ప్రముఖుడితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆమె అలాంటి రూమర్లను ఖండించింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నానని వెల్లడించింది. తాజాగా తనకు జరిగిన చేదు అనుభవాలను ఓ రేడియో జాకీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X