twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోధుమ పిండి ప్యాకెట్లో 15 వేలు పంపిణి .. అది అమీర్ ఖాన్ పనే.. సోషల్ మీడియాలో రచ్చ

    |

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌ను వివాదంలోకి లాగేలా చేసింది. లాక్‌డౌన్ సమయంలో ఓ ప్రాంతంలో పంచిన గోధుమపిండి ప్యాకెట్లలో డబ్బు పెట్టి పేదలకు పంచడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ డబ్బు పంచి పెట్టడం వెనుక అమీర్ ఖాన్ ఉన్నారనే విషయం మీడియాలో హైలెట్ అవుతుందంటంతో ఆయన వివరణ ఇచ్చారు. ఇంతకు అమీర్ ఖాన్ విషయంలో ఏం జరిగింది? మిస్టర్ ఫర్‌ఫెక్ట్ వివరణ ఏమిటి అంటే..

    ఢిల్లీలో గోధుమ పిండి ప్యాకెట్‌లో డబ్బు పంపిణి

    ఢిల్లీలో గోధుమ పిండి ప్యాకెట్‌లో డబ్బు పంపిణి

    స్థానికులు తెలిపిన ప్రకారం.. ఢిల్లీలో ఇటీవల అర్ధరాత్రి ఓ ప్రాంతంలో ట్రక్కు వచ్చి ఆగింది. లాక్‌డౌన్ సమయంలో గోధుమపిండి పంచుతున్నాం. అవసరముంటే ఎవరైనా వచ్చి తీసుకొవచ్చు. కానీ మనిషికి ఒకే ఒక కిలో గోధుమ పిండి ప్యాకెట్ ఇస్తామని చెప్పారు. కానీ ఒక కిలో గోధుమ పిండి కోసం అర్ధరాత్రి వెళ్లాలా? అని కొందరు ఊరుకొన్నారు. కానీ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని వచ్చి చూస్తే అందులో రూ.15 వేల పెట్టారు అని చెప్పారు.

    ప్యాకెట్ విప్పి చూస్తే 15 వేల రూపాయలు

    ప్యాకెట్ విప్పి చూస్తే 15 వేల రూపాయలు

    రాత్రివేళ పంచిన గోధుమ పిండి ప్యాకెట్‌లో రూ.15 వేలు ఉన్నాయనే ఘటన తెల్లవారే సరికి సంచలనంగా మారింది. తామెందుకు తీసుకోలేదనే బాధ కొందరిని వెంటాడితే.. మరికొందరు ఎవరు పంచారనే విషయంపై ఆరా తీశారు. దీంతో ఈ ఘటన వివాదంగా మారింది. ఈ డబ్బులు పంచింది బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అనే విషయం సోషల్ మీడియాలో ప్రచారమైంది.

    నాకు సంబంధం లేదని అమీర్ ఖాన్

    నాకు సంబంధం లేదని అమీర్ ఖాన్

    డబ్బుల పంపిణి వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుండటంతో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందించారు. గోధుమ పిండి ప్యాకెట్ల డబ్బులు పంచిన కార్యక్రమంతో తనకు సంబంధం లేదు. ఆ ఘటనతో నా పేరు ఎలా ముడిపెట్టారో అర్ధం కావడం లేదు. ఏదైనా సహాయం చేయాలనుకొంటే డైరెక్ట్‌గా చేస్తాను అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

    ఎవరో రాబిన్‌హుడ్ పనే

    అమీర్ ఖాన్ ఫేస్‌బుక్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ.. అందరికీ నా నుంచి ఒకటే మాట. గోధుమ పిండి ప్యాకెట్‌లో డబ్బులు పెట్టి పంచే వ్యాక్తిని కాదు. అది ఫేక్ స్టోరీ అయి ఉండాలి లేదా రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి తన పేరు బయట పడకుండా దానం చేసి ఉండాలి. అంతాగానే నాకు ఈ ఘటనతో సంబంధం లేదు. కరోనావైరస్‌ను ఎదురించడానికి ఇంటిపట్టునే ఉండి సురక్షితంగా ఉండాలి అని అమీర్ ఖాన్ ఓ మెసేజ్‌లో పేర్కొన్నారు.

     అమీర్ ఖాన్‌పై ప్రశంసలు

    అమీర్ ఖాన్‌పై ప్రశంసలు

    ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తి డబ్బుల పంపిణి చేసిన వ్యవహారంతో సంబంధం లేదంటూ అమీర్ ఖాన్ వివరణ ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎవరైనా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకొంటారు. క్రెడిట్ కొట్టేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అమీర్ ఖాన్ నిజాయితీగా తనకు సంబంధం లేదని చెప్పడం హ్యాపీగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

    Recommended Video

    Prabhas Got Prestigious Bollywood Offer
     కెరీర్ పరంగా ప్రస్తుతం

    కెరీర్ పరంగా ప్రస్తుతం

    కెరీర్ విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ అనే చిత్రం ఆధారంగా లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనాకపూర్, మోనాసింగ్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌పై కిరణ్ రావు, అమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను రూపొందిస్తు్నారు.

    English summary
    Aamir Khan clarity on Delhi truck incident which distributed Rs.15000 in Wheat packets. He said, Guys, I am not the person putting money in wheat bags. Its either a fake story completely, or Robin Hood doesn't want to reveal himself! Stay safe.Love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X