సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. చిన్నవయసులోనే నటి మృతి
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర విషాధాలు మిగులుస్తున్న ఈ సంవత్సరంలో మరో ప్రముఖ నటి కూడా చిన్న వయసులోనే ప్రాణాలు విడిచింది. ఒకరి మరణ వార్త గురించి మర్చిపోతున్న సమయంలోనే వెంటనే మరో విషాదం చోటు చేసుకోవడం షాక్ కి గురి చేస్తోంది. బాలీవుడ్‌లో స్పెషల్ ఐటెమ్ సాంగ్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిష్టీ ముఖర్జీ కన్నుమూసింది.
ఆమె వయసు 27ఏళ్ళు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఇటీవల చికిత్స పొందుతూ మిష్టీ తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మిష్టీ కెరీర్ మొదట్లోనే డ్యాన్సర్ గా మంచి ఛాన్స్ లు అందుకుంది. 2012లో లైఫ్ కి తో లగ్ గయి అనే సినిమా ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే సాంగ్ లో ఆమె చేసిన డ్యాన్స్ కి అద్భుతమైన రెప్పన్స్ వచ్చింది.

చిన్న వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు అందుకున్న మిష్టీ మ్యూజిక్ వీడియోలతోనే కాకుండా పలు బెంగాలీ సినిమాల్లోనూ వర్క్ చేశారు. గతంలో ఆమెపై వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మిష్టీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











