ప్రముఖ నటుడు మిథున్‌ను వెంటాడిన విషాదం.. లాక్‌డౌన్‌తో..
బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ముంబైలో మరణించారు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా మిథున్ ముంబైలో లేకపోవడం, అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం లేకపోవడం మరో విషాదంగా మారింది. మిథున్ తండ్రి మరణ వార్తను ఆయన కుమారుడు నమాషి చక్రవర్తి మీడియాకు వెల్లడించారు. ఇక వివారాల్లోకి వెళితే..

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ
మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ వయసు 95 సంవత్సరాలు. ఆయన కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దాంతోపాటు ఆయనకు వృద్ధాప్య సంబంధిత వ్యాధులు జతయ్యాయి. దాంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన మరణించారు.

మిథున్ కుమారుడు మీడియాకు వెల్లడి
మా తాత బసంత్ కుమార్ మంగళవారం రాత్రి మరణించారు. లాక్‌డౌన్ కారణంగా మా నాన్న బెంగళూరులో చిక్కుకుపోయారు. తాత అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ముంబై రావడానికి ప్రయత్నిస్తున్నారు. గురువారం ముంబైలో అంత్యక్రియలు నిర్వహిస్తాం అని నమాషి చక్రవర్తి మీడియాకు తెలిపారు.

లాక్‌డౌన్‌తో ముంబైలో
ఇదిలా ఉండగా, తండ్రి మరణంతో మిథున్ చక్రవర్తి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయన లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో ఇరుక్కుపోయారు. తండ్రి మరణ వార్త వినగానే ముంబై రావడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అనుమతి తీసుకొనేందుకు బెంగళూరులో ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పోలీసులు అనుమతిస్తే గురువారం మధ్యాహ్నానికి ఆయన ముంబై చేరుకొనే అవకాశం ఉంది అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Recommended Video

పలువురు ప్రముఖుల సంతాపం
పితృ వియోగంతో బాధపడుతున్న మిథున్ చక్రవర్తిని ఫోన్‌లో, సోషల్ మీడియా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బెంగాళీ నటి రితుపర్ణ సేన్‌గుప్తా ట్విట్టర్‌లో మిథున్‌కు సంతాపం తెలిపారు. ఆకస్మికంగా తండ్రిని కోల్పోయిన మిథున్‌కు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ సంతాప సందేశాన్ని ట్విట్టర్‌లో రాశారు.


Click it and Unblock the Notifications











