ప్రముఖ హీరో మొదటి భార్య మృతి.. మరణానికి ముందు సోషల్ మీడియాలో మిస్టరీ పోస్ట్

ప్రముఖ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి విషాదంలో మునిగిపోయారు. ఆయన మొదటి భార్య, ప్రముఖ నటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. దాంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అయితే ఆమె మరణానికి ముందు చేసిన సోషల్ మీడియాలో పోస్టు మిస్టరీగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లోకి 1985 సంవత్సరంలో హెలెనా ల్యూక్ హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది. వారిద్దరి కొద్దికాలం అఫైర్ కొనసాగించిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అయితే అనూహ్యంగా మిథున్‌తో నాలుగు నెలల వైవాహిక జీవితం తర్వాత ఆమె విడాకులు తీసుకొన్నారు. అదే సమయంలో నటి యోగితా బాలిని రెండో పెళ్లిగా మిథున్ చేసుకొన్నారు.

Mithun Chakraborty first wife Helena Luke passed away

అయితే మిథున్‌తో పెళ్లి ఓ పీడకల. ఆయన నన్ను మాటలతో బురిడీ కొట్టించారు. నేను ఆయన మాటలు నమ్మి మోసపోయాను. పెళ్లి తర్వాత నేను కోల్పోయింది ఏమిటో నాకు తెలిసింది. వెంటనే నా నిర్ణయం తప్పు అని తెలుసుకొన్నాను. వెంటనే నేను విడాకులు తీసుకొన్నాను అని ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాలీవుడ్‌లో ఆమె దో గులాబ్, ఆవో ప్యార్ కరే, భాయ్ ఆఖిర్ బాయ్ హోతా హై, అలాగే ఆమె అమితాబ్ బచ్చన్‌తో కలిసి మర్ద్ చిత్రంలో నటించింది.అయితే ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటి నుంచి తాను మిథున్‌కు దూరంగా బతుకుతూనే ఉంది.

Mithun Chakraborty first wife Helena Luke passed away

అయితే ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్‌లో హెలెన్ ల్యూక్ ఓ పోస్టు పెట్టింది. నేను చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాను. మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో ఉన్నాను. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్దం కావడంలేదు. నేను అసహనం, అసౌకర్యానికి లోనువుతున్నాను అని ఆమె తన మరణానికి ముందు ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఆమె చివరి పోస్టు మిస్టరీగా మారింది.

అయితే కొద్దికాలంగా హెలెన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. అనారోగ్యం కారణంగా ఆమె తాను ఓ రకమైన డిప్రెషన్‌కు లోనయ్యారు. చికిత్స పొందుతూ ఆమె నవంబర్ 3వ తేదీన అమెరికాలో మరణించారు. ఆమె మరణ వార్తను నటి కల్పనా అయ్యర్ మీడియాకు, సన్నిహితులకు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X