రేప్ కేసు: ఆగిపోయిన మిథున్ చక్రవర్తి కుమారుడి వివాహం
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం శనివారం(జులై 7) హీరోయిన్ మదాలసా శర్మతో జరుగాల్సి ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు ఐదు రోజుల క్రితమే మహాక్షయ్ మీద, అతడి తల్లి యోగితా బాలి మీద చీటింగ్, రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో శనివారం ఇద్దరికీ ఢిల్లీ కోర్టు యాంటిసిపెటరీ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం అదే రోజు పెళ్లి జరుగాల్సి ఉండగా.... కేసు విచారణ కోసం పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో మదాలసా శర్మ కుటుంబ సభ్యులు అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
Recommended Video


మహాక్షయ్, యోగితా బాలి మీద కేసు
మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, 2015 నుండి తనతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని కంప్లయింట్లో పేర్కొంది. తర్వాత తనకు ఇష్టం లేకున్నా ఏవో మందుల ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేశాడని ఆరోపించింది. మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని, నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించందని, అందుకే ఆమెపై కూడా కేసు పెట్టినట్లు సదరు యువతి తెలిపింది.

కేసు నమోదైన తర్వాత కూడా పెళ్లికి ఏర్పాట్లు
కేసు నమోదైనప్పటికీ ఇరు కుటుంబాల వారు వివాహ వేడుక ముందుగా అనుకున్న ప్రకారమే జరుపాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఉదగమండలం(ఊటి)లోని వరుడి కుటుంబానికి చెందిన లగ్జరీ హోటల్‌లో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేసులో నిందితులను విచారించేందుకు పోలీసులు హోటల్‌కు చేరుకోవడంలో మదాలసా శర్మ కుటుంబ సభ్యులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

బెయిల్ మంజూరు
దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్‌లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేయగా... వారు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. శనివారమే వారికి బెయిల్ మంజూరైంది.

మదాలసా, మహాక్షయ్ రిలేషన్
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలసా శర్మ కొంత కాలంగా మహాక్షయ్ చక్రవర్తితో రిలేషన్లో ఉంది. ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేసు నమోదైన తర్వాత కూడా మదాలసా కుటుంబం పెళ్లికి సిద్దమవ్వడం చర్చనీయాంశం అయింది. అయితే వరుడిని, అతడి తల్లిని పెళ్లి వేడుక వద్దకు పోలీసులు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉంటే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మదాలసా శర్మ కుటుంబం పెళ్లి వేడుకను రద్దు చేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











