ఆర్యన్ ఖాన్‌తో NCB అరెస్ట్ చేసిన 39 ఏళ్ళ ఆ హాట్ లేడి ఎవరు.. అందరి ఫోకస్ ఆమె పైనే..

ముంబై క్రూయిజ్ డ్రగ్ బస్ట్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. మొదట కేవలం కొన్ని సందేహాల నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కానీ ఆ తరువాత అరెస్ట్ చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. నేషనల్ మీడియాలో ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరు బడా సెలబ్రేటీల పిల్లలను కూడా అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అందులో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్‌లను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసింది. ఆయితే మున్మున్ ఎవరు అనే సందేహాలు చాలానే వస్తున్నాయి. ఒకసారి ఆమె వివరాల్లోకి వెళితే..

అకస్మాత్తుగా సోదాలు

అకస్మాత్తుగా సోదాలు

అక్టోబర్ 3న ముంబై లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఎవరు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ తో పాటు మున్మున్ ధమేచా, అర్బాజ్ సేథ్ మర్చంట్‌ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లో నిర్వహించిన రేప్ పార్టీలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి ఆరా తీసేందుకు అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు.

ఇక ఆర్యన్, మున్మున్ మరియు అర్బాజ్‌తో సహా మరొక ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై తీరానికి దగ్గరగా ఉన్న ఒక ఓడ నుంచి భారీగా డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు.

షారుక్ ఫ్యామిలీ అప్సెట్

షారుక్ ఫ్యామిలీ అప్సెట్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అనగానే ఒక్కసారిగా ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షారుక్ సతీమణి ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ఈ విషయంలో తీవ్ర స్థాయిలో అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఖాన్ ఫ్యామిలీకి దగ్గరగా వుండే కొంతమంది మీడియా సన్నిహితులు కూడా ఈ విషయంపై ప్రశ్నించేందుకు సంప్రదించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

39 ఏళ్ళ మోడల్ కూడా

39 ఏళ్ళ మోడల్ కూడా

ఇక ఈ కేసులో అర్బాజ్ సేథ్ మర్చంట్ ఆర్యన్ యొక్క సన్నిహితుడు అని తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అరెస్టయిన మున్మున్ గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 39 ఏళ్ళ మున్మున్ ధమేచ ఒక మోడల్. ఆమెను కూడా అక్టోబర్ 3 మధ్యాహ్నం 2 గంటలకు ఎన్‌సిబి అరెస్టు చేసింది.

ఆమె బ్యాక్ గ్రౌండ్..

ఆమె బ్యాక్ గ్రౌండ్..

మున్మున్ ధమేచా మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా నివాసి. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటోంది. మున్మున్ తల్లి గత సంవత్సరం మరణించింది. ఆమెకు ఢిల్లీలో పనిచేస్తున్న ప్రిన్స్ ధమేచా అనే సోదరుడు కూడా ఉన్నాడు. ఆమె పాఠశాల విద్యను సాగర్‌లో పూర్తి చేసింది. ఇక మున్మున్ గురించి సాగర్‌లో చాలా మందికి తెలియదు. కొన్నాళ్లకు ఆమె భోపాల్‌లో కొంతకాలం నివసించారు. ఆరేళ్ల క్రితం తన సోదరుడితో కలిసి ఢిల్లీలో కూడా జీవనం కొనసాగించారు.

Recommended Video

#BiggBossTelugu ఇతను Eliminate అవడం పక్కా.. టాప్ 5 వీరే!! || Filmibeat Telugu
సోషల్ మీడియాలో బిజీగా..

సోషల్ మీడియాలో బిజీగా..

మున్మున్ కు ఇన్స్టాగ్రామ్ లో 10.3k ఫాలోవర్స్ కూడా ఉన్మారు. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖులు ఎవరూ అనుసరించనప్పటికీ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్ అలాగే అనేక మందిని ఫాలో అవుతున్నట్లు చూడవచ్చు. కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌ లో ఉన్న ఎనిమిది మందిని మొదట అక్టోబర్ 3 న ఎన్‌సిబి అదుపులోకి తీసుకుని విచారించింది. అందులో ఆర్యన్ ఖాన్‌ తో పాటు మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా అలాగే అర్బాజ్ మర్చంట్ ఉన్నారు. ప్రస్తుతం, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X