ఒంటరైన ప్రఖ్యాత గాయని.. చొరవ చూపిన కేంద్రమంత్రి.. అందుకే గెలిచింది అంటూ..
కేంద్రమంత్రి సృతి ఇరానీపై ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు. ఇటీవల ప్రధాని ప్రమాణ స్వీకారానికి అతిథిగా హాజరైన ఆశాను వేదిక వద్ద ఎవరూ పట్టించుకోలేదట. ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లడంతో కంగారు పడుతున్న నాకు సృతి సహాయం అందించారు. ఈ విషయాన్ని ఆశాభోంస్లే తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి భారీగా హాజరవ్వడంతో గందరగోళం నెలకొన్నది. నాకు ఎవరు తోడుగా లేకపోవడంతో ఒంటరిదానినై దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాను. నన్ను గమనించిన కేంద్ర మంత్రి సృతి ఇరానీ వెంటనే నా వద్దకు వచ్చింది. నాకు ధైర్యం చెప్పి ఇంటికి సురక్షితంగా చేరేలా చర్యలు తీసుకొన్నారు. ఆమె చూపిన చొరవకు నాకు హ్యాపీ అనిపించింది. అందుకే సృతి ప్రజలనే గెలుచుకోవడం కాకుండా.. పోటీలో కూడా విజయం సాధించారు అని ఆశాభోంస్లే ట్వీట్ చేసింది. ఆశాభోంస్లే ట్వీట్‌కు స్పందించిన సృతి ఇరానీ చేతులెత్తి నమస్కరిస్తూ తన రియాక్షన్ తెలిపింది.
కాగా, గురువారం రాత్రి జరిగిన ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి బాలీవుడ్ ప్రముఖులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో కంగన రనౌత్, కరణ్ జోహర్, అభిషేక్ కపూర్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ కపూర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, కైలాష్ ఖేర్, రజనీకాంత్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కపిల్ శర్మ, తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











