Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలీవుడ్ లో కూడా బిజీ అవుతున్న మోనాల్.. బిగ్ బాస్ ఇచ్చిన బూస్ట్ తో బంపర్ ఆఫర్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ఈ సారి కంటెస్టెంట్స్ మంచి క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి. కేవలం టాప్ 5 లిస్ట్ లోకి వచ్చినవారే కాకుండా బిగ్ బాస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన మరికొందరు కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్నారు. ఇక అలాంటి వారికి సినిమాల్లో ఛాన్సులు కూడా బాగానే వస్తున్నాయి. ఇక మోనాల్ అయితే మ్మరికొన్ని ఛాన్స్ లు కొట్టేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
సారా ఆలీ ఖాన్ అందాల జిగేల్... మీరెప్పుడూ చూడని బాలీవుడ్ భామ పోటోలు
అందులో మోనాల్ కూడా..
బిగ్ బాస్ ద్వారా గత మూడు సీజన్స్ లలో మంచి గుర్తింపు అందుకుంది మాత్రం కొందరే అని చెప్పాలి. ఇక ఈ సారి మాత్రం అద్భుతమైన పెర్ఫామెన్స్ తో క్రేజ్ అందుకున్న వారిలో మోనాల్ ఒకరు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా మొత్తానికి గ్లామరస్ గర్ల్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటోంది.
మొత్తానికి ఇండస్ట్రీ దృష్టిలో పడింది
ఇక ఇటీవల ఈ బ్యూటీకి అల్లుడు అదుర్స్ ద్వారా ఐటెమ్ సాంగ్ లో కనిపించే అవకాశం దక్కింది. మొత్తానికి ఇండస్ట్రీ దృష్టిలో పడినట్లు అర్ధమవుతోంది. ఇంతకుముందు సుడిగాడు లాంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నప్పటికి ఆమె ఎక్కువ రోజులు బిజీ అవ్వలేదు. ఇక ఫెడవుట్ అవుతోందని అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ ద్వారా క్లిక్కయ్యింది.
కియారా గ్లామర్ మోత.. వైరల్గా లేటేస్ట్ ఫోటోషూట్
తొందరపడకుండా..
కేవలం తేలుగులోనే కాకుండా తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా ఈ బ్యూటీకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. కానీ అమ్మడు మాత్రం మరోసారి తొందరపడకుండా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐటెమ్ సాంగ్స్ విషయంలో అయితే పెద్దగా ఆలోచించడం లేదట. కానీ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే సినిమాలపై ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ మూవీ క్లిక్కవ్వడంతో
బిగ్ బాస్ కంటే ముందే పూర్తి చేసిన మోనాల్ యొక్క బాలీవుడ్ తొలి చిత్రం కాగాజ్ ఇటీవల జీ5 లో విడుదలైంది. ఆ సినిమాకి అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. కాగాజ్ ను సల్మాన్ ఖాన్ నిర్మించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు-చిత్రనిర్మాత సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆ మూవీ క్లిక్కవ్వడంతో అమ్మడి పేరు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ లో బిజీ కానున్న మోనాల్
బాలీవుడ్ లో ఇటీవల కొన్ని బడా ప్రొడక్షన్ సంస్థల నుంచి ఆమెకు పిలుపు వచ్చినట్లు సమాచారం. నిర్మాతలు ఆమెకు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారా. ఎక్కువగా గ్లామర్ రోల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మోనాల్ కూడా బాలీవుడ్ లో బిజీ కానున్నట్లు త్వరలోనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చెప్పింది. మరి ఆ సినిమాలు మోనాల్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.