Most Popular Female Stars: ఆఖరి స్థానంలో టాప్ హీరోయిన్.. నెంబర్ 1లో అలియా భట్!

ఇటీవల కాలంలో స్టార్ సెలబ్రిటీలు సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వారి గ్లామరస్ ఫోటోలతో అలాగే రెగ్యులర్ సినిమాల అప్డేట్స్ తో ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ముఖ్యంగా హీరోయిన్ అయితే ఫోటోషూట్స్ తో కూడా సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు. ఓరామాక్స్ సర్వేలో స్టార్ సెలబ్రిటీల ర్యాంక్స్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు నెలలో నిర్వహించిన సర్వేల ఆధారంగా టాప్ బాలీవుడ్ హీరోయిన్స్ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి..

అలియా భట్, దీపికా

అలియా భట్, దీపికా

ఎప్పటిలానే అలియా భట్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఈ బ్యూటీ గత నెలలో బ్రహ్మాస్త్ర సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ తో చాలా బిజీ బిజీగా కనిపించింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమా కోసం ప్రమోషన్స్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే దీపిక పదుకొనె పేరు కూడా బాగా వైరల్ అయింది. దీంతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఒక విధంగా రన్వీర్ సింగ్ వార్తలతోనే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

కత్రినా, కీయరా

కత్రినా, కీయరా

ఇక మూడవ ర్యాంకుతో కత్రినా కైఫ్ కొనసాగుతోంది. ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువగా ఇటీవల హాలిడేస్ కు వెళ్ళింది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానుల చూపులు తన వైపు తిప్పుకుంటుంది. మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వాని కూడా ఎక్కువగా లవ్ గాసిప్స్ కు సంబంధించిన రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. ఇక ఈ సర్వేలో ఆమె నాలుగో ర్యాంకులో ఉండడం విశేషం.

కృతి సనోన్, కరీనా కపూర్

కృతి సనోన్, కరీనా కపూర్

ఆగస్టు నెలలో బాగా వైరల్ అయిన వారిలో కృతి సనోన్ పేరు కూడా ఉంది. 5వ స్థానంలో ఉన్న కృతి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆరవ స్థానంలో కరీనాకపూర్ నిలిచింది. ఆమె లాల్ సింగ్ చడ్డా సినిమాతో గత నెలలో ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో కొనసాగింది.

శ్రద్దా కపూర్, దిశా పటాని

శ్రద్దా కపూర్, దిశా పటాని

ఏడవ స్థానంలో మరో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నిలిచింది. ఆమెకు సంబంధించిన సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక వార్తతో అయితే ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం తన ఫ్యాన్ ఫాలోవర్స్ ఆకట్టుకుంటుంది. ఆ మధ్య పెళ్లి వార్తలు కూడా వచ్చినప్పటికీ అమ్మడు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఎనిమిదో స్థానంలో దిశా పటాని కొనసాగుతోంది. ఎప్పటిలాన్ని ఈ బ్యూటీ బ్రేకప్ న్యూస్ లతో గత నెల ట్రెండింగ్ లిస్టులో కొనసాగింది.

ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్

ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్

ఇక తొమ్మిదవ స్థానంలో ప్రియాంక చోప్రా నిలవడం విశేషం. బాలీవుడ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఏదో ఒక విధంగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యేలా చేస్తుంది. ఇక 10వ స్థానంలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ నిలవడం విశేషం. ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఈ నెలలో విడుదలవుతుండగా గత నెల నుంచి ఐశ్వర్య పేరు డిజిటల్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X