పెళ్లి నుంచి వెళ్లిపోతానని బెదిరించిన హీరోయిన్.. రచ్చ రచ్చ చేసింది!
బుల్లి తెరపై హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ బాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నిత్యం అభిమానులకు మౌనిరాయ్ చేరువగా ఉంటుంది. మూడు పదుల వయసులో కూడా మౌని రాయ్ యువతని కట్టిపడేసే గ్లామర్ తన సొంతం. ఇటీవల ఆకాష్ అంబానీ, శ్లోక మెహతా వివాహ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో మౌని రాయ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఆ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

సెక్యూరిటీ సిబ్బంది
వివాహ వేడుకలో సెక్యూరిటీ సిబ్బంది వలన మౌని రాయ్ ఇబ్బందులు ఎదుర్కొందట. మౌని రాయ్ ఈ వివాహవేడుకలో తన నాట్య ప్రదర్శన చేయడానికి వెళ్ళింది. చాలా మంది సినీ తారలు మౌని రాయ్ పెళ్లి వేడుకలో పెర్ఫామ్ చేసేందుకు వెళ్లారు. వారిలో మౌని రాయ్ కూడా ఓ సెలెబ్రిటీ. కానీ అక్కడి సెక్యూరిటీ నిబంధనలతో మౌని రాయ్ విసిగిపోయినట్లు తెలుస్తోంది.

ఫోన్ ఉపయోగించకుండా
వివాహ వేదిక వద్దకు ప్రవేశించే సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి, మౌని రాయ్ కి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ ని ఉపయోగించడానికి వీల్లేని విధంగా స్టిక్కర్స్ తో సీల్ చేశారు. దీనితో మౌని రాయ్ చాలా అసంతృప్తి చెందిందట. సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. పెళ్లి వేడుకలో ఫోన్ ఉపయోయించడానికి వీల్లేదని, ఈ నిబంధన అందరి గెస్ట్ లకు వర్తిస్తుందని సిబ్బంది చెప్పడంతో మౌనిరాయ్ అంగీకరించిందట.

వెళ్ళిపోతానంటూ బెదిరింపులు
లోనికి వెళ్లిన తర్వాత మౌని రాయ్ సెక్యూరిటీ సిబ్బంది అతికించిన సిక్కర్ పీకేసి ఫోన్ ఉపయోగించడం ప్రారంభించింది. వెంటనే అలారమ్ మోగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమె వద్దకు వచ్చారు. మౌని రాయ్ కు అక్కడ ఉన్న నిబంధనల గురించి మరోమారు వివరించారు. దీనితో మౌనిరాయ్ పూర్తిగా విసిగిపోయిందట. తాను పెర్ఫామ్ చేయకుండానే వెళ్లిపోతానని బెదిరించినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే మౌనిరాయ్ అడ్వాన్స్ తీసుకుని ఉండడంతో తప్పనిసరిగా పెర్ఫామ్ చేయాల్సి వచ్చింది.

పరిస్థితి అదుపులోకి
మౌని రాయ్ తో వాదించడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. దీనితో అంబానీ సెక్యూరిటీ ఉన్నత అధికారులు ఆమె వద్దకు వచ్చి పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకుని వచ్చారు. తాము తీసుకుంటున్న సెక్యూరిటీ నిబంధనలకు సహకరించాలని కోరడంతో మౌని రాయ్ శాంతించినట్లు తెలుస్తోంది. ఆకాష్ అంబానీ పెళ్లి వేడుకలో అంతర్జాతీయ సెలెబ్రిటీలు కూడా పెర్ఫామ్ చేశారు.


Click it and Unblock the Notifications











