ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో హీరోయిన్ అందం కొలాప్స్.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్

అందమంటే ఆడవారికి, డబ్బంటే మగవారికి ఆశ చాలదు. ఎంతున్నా ఇంకా కావాలనే కోరుకుంటారు తప్ప కాదనలేరు. ఈ మేరకు డిఫెరెంట్ డిఫెరెంట్ కోణాల్లో వాటిని దక్కించుకుందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో అందంపై ఉన్న మోజుతో ఓ హీరోయిన్ చేసిన పని ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. నాచురల్ గానే ఎంతో గ్లామర్‌గా ఉండే ఆ ముద్దుగుమ్మ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఉన్న అందాన్ని కూడా కొలాప్స్ చేసుకుంది. ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తున్న ఈ ఉదంతంపై వివరాలు చూస్తే..

బాలీవుడ్ నటి మౌనిరాయ్

బాలీవుడ్ నటి మౌనిరాయ్

మౌనిరాయ్.. సోషల్ మీడియాలో అందాన్ని ఆస్వాదించే ప్రతీ ఒక్కరికీ ఈమె తెలిసే ఉంటుంది. బుల్లి తెరపై హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆపై బాలీవుడ్ వెండితెరపై కాలుమోపి హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈమెలో అందానికి ఏ మాత్రం కొదవే లేదు. కానీ తనకున్న అందం సరిపోదని భావించిన ఈమె ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళింది.

వికటించిన ప్లాస్టిక్ సర్జరీ

వికటించిన ప్లాస్టిక్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు. ఒక్కోసారి వికటిస్తే ఉన్న అందం కాస్త ఆవిరైపోతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలామంది నటులు ఎదుర్కొన్నారు కూడా. ఇవన్నీ తెలిసి కూడా దైర్యంగా ప్లాస్టిక్ సర్జరీకి వెళ్లిన మౌనిరాయ్ ఉన్న అందాన్ని ఊడ్చేసుకుందట. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమెను చూసి షాకైన జనం.. ఆమె చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించింది చెప్పుకుంటున్నారు.

అలా దొరికి పోయిన మౌనిరాయ్

అలా దొరికి పోయిన మౌనిరాయ్

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భారత్ మూవీ స్పెషల్ షో చూసేందుకు వచ్చింది మౌని రాయ్. ఈ షోకి వచ్చిన సమయంలో ఆమె ముఖంలో పేలిపోయిన అందం చూసి షాకయ్యారు అందరూ. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది అంటూ నేరెళ్ల బెట్టి ఆశ్చర్యపోయారు. ప్లాస్టిక్ సర్జరీల అనంతరం ఇలా కెమెరాకు చిక్కిన మౌనిరాయ్ విమర్శల పాలవుతోంది.

నెటిజన్స్ ట్రోలింగ్.. పెద్ద ఎత్తున విమర్శలు

నెటిజన్స్ ట్రోలింగ్.. పెద్ద ఎత్తున విమర్శలు

నాచురల్ గానే బ్యూటీ అయిన మౌనిరాయ్.. అత్యాశకు పోయి ఉన్న అందాన్ని నాశనం చేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏంజిల్ లా ఉండే మీ ముఖం నాశనం అయిందని, మీ పెదవులకు ఏమైంది? ఎందుకలా తయారయ్యాయి? ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా అంటూ కామెంట్స్ పెడుతూ ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో 'ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను' అన్నట్లుగా తయారైంది ఆమె పరిస్థితి.

More from Filmibeat

Read more about: mouni roy glamour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X