దోస్తీ తెచ్చిపెట్టిన తంటా - ఆమిర్ ఖాన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన బాలీవుడ్ బడా ఖాన్ ఆమిర్, మరోసారి ట్రాలింగ్ కు గురౌతున్నారు. గతంలో భారత్ లో ఇన్ టాలెరెన్స్ పై వ్యాఖ్యానించి పెద్ద వివాదమే సృష్టించిన ఆమిర్ ఖాన్, ఇప్పుడు మరో వివాదానికి తెరలేపారు. షూటింగ్ లో భాగంగా ఇస్తాన్ బుల్ వెళ్లిన ఖాన్, అక్కడ టర్కీ ప్రథమ మహిళను కలసి ట్రాలింగ్ కు గురౌతున్నారు.

లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్లిన ఆమిర్, ఇస్తాన్ బుల్ లో టర్కీ ప్రధమ మహిళ ఎమిన్ ఎరోగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తామిద్దరూ కలసి దిగిన ఫొటోను ఎమిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ భారత నటుడు ఆమిర్ ఖాన్ ను కలవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. టర్కీలోని వివిధ ప్రాంతాల్లో లాల్ సింగ్ చద్దా షూటింగ్ చేయడం అత్యంత ఆనందకరమైన విషయమని, ఈ సినిమా కోసం వేచి చూస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. అక్కడివరకూ బాగనే ఉన్నా, ఈ పోస్ట్ అనంతరం ఆమిర్ విపరీతంగా ట్రాలింగ్ కు గురౌతున్నారు.

Mr. Perfectionist trolled yet again

గతంలో కాశ్మీర్ లోయలో ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ప్రటిస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై ఆమిర్ దేశ శత్రువులను ఎలా కలుస్తారు అంటూ ట్విట్టర్ లో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. చిన్న దేశాల నుంచి వచ్చే సెలబ్రిటీలు సైతం తమ దేశానికి కృతజ్ఞతను చూపుతారు, కానీ, ఈ బాలీవుడ్ జనం ఎప్పటికీ తమ దేశాన్ని గౌరవించలేరు అన్న ట్రాలింగ్ తో ప్రస్తుతం ట్విట్టర్ ఊగిపోతోంది. ఇందులో భాగంగా, గతంలో ఆమిర్, భారత్ కు అత్యంత ఆప్తమిత్రునిగా పేరుగాంచిన ఇజ్రయెల్ ముఖ్యమంత్రి నెతాన్యుని కలిసేందుకు నిరాకరించిన వైనాన్ని గుర్తుచేశారు. మరి దీనికి ఆమిర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: aamir khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X