సినీ ఇండస్ట్రీలో విషాదం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్రెండ్ ఆత్మహత్య.. సెల్పీ వీడియోలో షాకింగ్ విషయాలు

కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్య కారణాలతోనో.. ప్రమాదాల వల్లో.. ఆత్మహత్యలు చేసుకునో చాలా మంది సినీ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇవి ఎక్కువగా కనిపించాయి. మరీ ముఖ్యంగా యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హిందీ పరిశ్రమకు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో నటుడు సందీప్ నహర్ బలవన్మరణానికి పాల్పడడం సంచలనం అవుతోంది. ఇంతకీ అతడి మరణానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళ్తే...

సుశాంత్ మరణం... ఊహించని ట్విస్టులు

సుశాంత్ మరణం... ఊహించని ట్విస్టులు

'కోయి పో చే' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌లో నటించి అందరి దృష్టిలో పడ్డాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర హైకోర్టులో ఇది నడుస్తోన్న విషయం తెలిసిందే.

వరుస మరణాలతో ఇండస్ట్రీకి తీరని లోటు

వరుస మరణాలతో ఇండస్ట్రీకి తీరని లోటు

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది పేరున్న నటీ నటులతో పాటు చిన్న చిన్న యాక్టర్లు కూడా ప్రాణాలను కోల్పోయారు. కరోనా సమయంలోనూ పలువురు నటులు మృత్యువాత పడ్డారు. ఇక, తాజాగా సీనియర్ హీరో రాజీవ్ కపూర్ కూడా మరణించారు. ఇలా బాలీవుడ్‌లో వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

బాలీవుడ్‌లో మరో విషాదం.. ఆత్మహత్య

బాలీవుడ్‌లో మరో విషాదం.. ఆత్మహత్య

వరుస మరణాలు సినీ ఇండస్ట్రీకి తీరని లోటును మిగుల్చుతున్నాయి. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన 'ఎంఎస్ ధోనీ' సినిమాలో అతడి స్నేహితుడిగా నటించిన సందీప్ నహర్ (33).. సోమవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

గదిలో విగత జీవిగా.. ఆస్పత్రికి తీసుకెళ్తే

గదిలో విగత జీవిగా.. ఆస్పత్రికి తీసుకెళ్తే

కొద్ది రోజులుగా మనోవేదనతో ఉన్న సందీప్ సోమవారం రాత్రి తన గదిలో విగతజీవిగా కనిపించాడు. దీంతో భార్య, స్నేహితులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సందీప్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. రిపోర్టు తర్వాతే స్పందిస్తామని వాళ్లు చెప్పారు.

చావుకు ముందే సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి

చావుకు ముందే సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి

ఆత్మహత్యకు ముందు సందీప్ నహర్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో తన చావుకు గల కారణాలను వెల్లడించాడు. 'కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో, వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నా. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. అందరూ నన్ను క్షమించండి' అంటూ అందులో తెలిపాడు.

భార్యపైనా ఆరోపణలు.. చావుకు కారణం

భార్యపైనా ఆరోపణలు.. చావుకు కారణం

ఇదే సెల్ఫీ వీడియోలో తన భార్యపైనా సంచలన ఆరోపణలు చేశాడు సందీప్ నహర్. కానీ, తన చావుకూ ఆమెకూ ఎటువంటి సంబంధం లేదని వెల్లడించాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? అని అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సందీప్ నహర్.. అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి'లోనూ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X