కోడలు రాధిక మర్చంట్ కోసం అంబానీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కొడుకును మెప్పించేందుకు ఏం చేస్తున్నాడో తెలుసా?

By Lekhaka

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి సంబరాలు షురూ కాగా, కోడలికి సర్ప్రైజ్ ఇవ్వడానికి అంబానీ ప్లాన్ చేశారట. ఆమెకు ఇష్టమైన అంతర్జాతీయ సింగర్ ను ఇండియాకు రప్పించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ సింగర్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.

అనంత్ అంబానీ ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఈ ఏడాది మార్చి ప్రారంభంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. తరువాత రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక మే నెల చివరి వారంలో ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌లో జరిగింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు తారలు ఇందులో పాల్గొన్నారు. హాలీవుడ్ సింగర్ రిహన్నా, ది బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్, పిట్‌బుల్, ఇటాలియన్ ఒపెరా సింగర్ ఆండ్రియా బోసెల్లి గుజరాత్‌లో జరిగిన అనంత్, రాధికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు.

Mukesh Ambani Surprise gift for Radhika Merchant Adele Drake amp amp Lana Del Rey To Perform Anant Ambani Wedding Event

ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం గ్రాండ్ గా జరగనుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 2024 జూలై 12న ముంబైలో వివాహం చేసుకోనున్నారు. వారి వివాహానికి ముందు ముఖేష్, నీతా అంబానీ జూలై 2న నవీ ముంబైలో 50 మంది నిరుపేద జంటలకు తమ చేతుల మీదుగా పెళ్ళిళ్ళు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అనంత్ - రాధిక పెళ్లికి సంబంధించిన మరో పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది.

మీడియా కథనాల ప్రకారం ప్రముఖ రాపర్, గాయకుడు డ్రేక్ అనంత్, రాధికల వివాహంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అంతర్జాతీయ కళాకారుడు డ్రేక్ త్వరలో భారత్‌కు రానున్నారు. దాంతో ఆయన అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. డ్రేక్ మాత్రమే కాకుండా అంబానీ టీం ఇతర అంతర్జాతీయ కళాకారులతో చర్చలు జరుపుతోంది.

Mukesh Ambani Surprise gift for Radhika Merchant Adele Drake amp amp Lana Del Rey To Perform Anant Ambani Wedding Event

అమెరికన్ సింగర్ లానా డెల్ రే, బ్రిటీష్ పాప్ సింగర్ అడెలె కూడా అనంత్, రాధికల పెళ్లిలో ప్రదర్శన ఇవ్వవచ్చు. రాధిక మర్చంట్ లానా డెల్ రేకు వీరాభిమాని. కాబట్టి తమ కాబోయే కోడలు ఆనందం కోసం అంబానీ కుటుంబం లానాను కూడా ఎంత ఖర్చయినా సరే వెనకాడకుండా ఇండియాకు రప్పించే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్టార్లతో అంబానీ మేనేజ్‌మెంట్ బృందం చర్చలు జరుపుతోంది. వారి డేట్స్, పారితోషికం చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12 నుంచి 14 వరకు గ్రాండ్ గా జరగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ తారలతో పాటు పలువురు క్రీడా, వ్యాపార ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. వీరిద్దరి పెళ్లి జూలై 12న గ్రాండ్ గా జరగనుంది. ఆ తర్వాత జులై 13న ఆశీర్వాద కార్యక్రమం జరగనుంది. జూలై 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీఐపీలు, వీవీఐపీ అతిథులు హాజరవుతారు.

More from Filmibeat

Read more about: mukesh ambani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X