వారి వల్లే మీటూ మొదలైంది.. మహిళలపై ‘శక్తిమాన్’ సంచలన కామెంట్స్
దేశంలో ఓ వైపు మహిళా సాధికారత మాట్లాడుతుంటారు. మరో వైపు మహిళలపై జరిగే అత్యాచారాల వింత కామెంట్లు చేస్తుంటారు. మహిళల వల్లే అలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని రాజకీయ నాయకులే మళ్లీ వింతపోకడలకు తెరలేపుతారు. దేశంలో మహిళల కోసం చట్టాలు, ప్రత్యేక బడ్జెట్‌లు కల్పిస్తారు. కానీ మళ్లీ కించపరిచేలా, తక్కువ చేసేలా మాటలు వదులుతుంటారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు, నాయకులు కూడా మహిళపై దారుణమైన కామెంట్లు చేస్తుంటారు.

మహిళల వల్లే..
మహిళలు ధరించే దుస్తులు, వారు బయటకు రావడం వల్లే అలాంటి దారుణ ఘటనలు జరుతున్నాయని రాజకీయ నాయకులు ఎన్నో సందర్భాల్లో కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లు విన్న ప్రతీసారి సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడతాయి. మళ్లీ అంతా చల్లబడుతుంది. తాజాగా శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు.

కుదిపేసిన మీటూ..
ఇండియాను మీటూ ఉద్యమం కుదిపేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం మాయని మచ్చలా మిగిలింది. కేసులు అయితే నిరూపించడబడటం లేదు కానీ ఆరోపణలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద సెలెబ్రిటీలపై మీటూ ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటిపై ముఖేష్ ఖన్నా స్పందించాడు.

వారి వల్లే ఇవన్నీ..
మీటూపై ముఖేష్ ఖన్నా స్పందిస్తూ.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడమే అడవారి పని. మీటూ అనేది ఆడవారు పనికోసం బయటకు వచ్చినప్పటి నుంచే మొదలైంది.. ఇప్పుడు ఆడవారు భుజం భుజం రాసుకు పూసుకు పని చేసుకుంటున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

నెటిజన్స్ ఫైర్..
చిన్నప్పుడు మన అందరికీ ఐకానిక్‌లా ఉండే శక్తిమాన్ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి.. అతనికి ఏదో మానసిక వ్యాధి ఉన్నట్టుంది అందుకే అలా మాట్లాడుతున్నాడు.. ఆడవారు బయటక వస్తే మగవారు అలా చేయాలన్న రూల్ ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖేష్ అజ్ఞానానికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











