twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైనర్ సినీనటికి లైంగిక వేధింపులు.. ముంబై వాసికి కోర్టు జైలుశిక్ష

    |

    బాలీవుడ్ నటిని లైంగికంగా వేధించినట్టు దాఖలైన ఓ కేసులో ముంబైకి చెందిన ఓ కన్సల్టెంట్‌ను ముంబైకి చెందిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు దోషిగా నిర్ఱారించింది. సదరు నిందితుడు గతంలో విమాన ప్రయాణంలో తాను మైనర్‌గా ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలైన నటి కీలక విచారణకు సహకరించకపోవడంతో అనేక అనుమానాలు ఈ కేసులో వ్యక్తమవుతున్నది. కేసు వివరాల్లోకి వెళితే..

    నా వెనుక సీట్లో కూర్చొని

    నా వెనుక సీట్లో కూర్చొని

    సదరు నటి ఫిర్యాదు ప్రకారం.. విమానంలో తన వెనుక సీటులో వికాస్ సచ్‌దేవా కూర్చున్నాడు. తన కాలును తన సీటుపై ఆర్మ్ రెస్ట్‌పై పెట్టి ఇబ్బంది కలిగించాడు. అంతేకాకుండా శారీరకంగా వేధించాడు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఏడుగురు సాక్షుల్లో ముగ్గురు (ఓ పాసింజర్, ఇద్దరు సిబ్బంది) సచ్‌దేవా విమాన ప్రయాణంలో పూర్తిగా నిద్రపోయాడు అని తెలిపారు.

    విమాన ప్రయాణంలో నిద్రలోనే

    విమాన ప్రయాణంలో నిద్రలోనే

    ఢిల్లీలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సచ్‌దేవా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. దాంతో బాగా అలసిపోయాడు. దాంతో గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. ఆ క్రమంలోనే తన కాలు నటి సీటు ఆర్మ్ రెస్ట్‌పై పెట్టి ఉండవచ్చనే అభిప్రాయాన్ని సచ్‌దేవా వ్యక్తం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని తన వాదనను వినిపించారు.

    కీలక విచారణకు గైర్హాజరు

    కీలక విచారణకు గైర్హాజరు

    నటి ఫిర్యాదు మేరకు కోర్టు చేపట్టిన విచారణలో కీలక విచారణ సమయంలో ఆమె హాజరుకాలేదు. ప్రధాన వాదనలు, నిందితుడి గుర్తింపు ప్రక్రియకు ఆమె గైర్హాజరయ్యారు. పోలీసులు, కోర్టు జారీ చేసిన పలు నోటీసులకు కూడా నటి స్పందించలేదనేది తాజా సమాచారం.

    నాకు చేదు అనుభవం

    నాకు చేదు అనుభవం

    కాగా, సదరు నటి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం కూడా వివాదంగా మారింది. విమాన ప్రయాణంలో జరిగిన సంఘటన నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తనకు ఇష్టం లేని సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసిక సంఘర్షణకు గురవుతున్నానని, దానిని అధిగమించేందుకు వైద్య చికిత్స జరుగుతున్నది. విపరీతంగా మెడిసిన్స్ వాడటం వల్ల శరీరం కూడా సహకరించడం లేదు అని పోస్టులో నటి పేర్కొన్నది.

    దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు

    దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు

    ఇదిలా ఉండగా, జనవరి 15న స్పెషల్ పోస్కో కోర్టు సచ్‌దేవాను దోషిగా నిర్ణారించింది. పోస్టు చట్టం, ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఆయనను దోషిగా పేర్కొంటూ తీర్పు చేప్పింది. ఈ తీర్పు వెల్లడి కాగానే సచ్‌దేవాతోపాటు ఆయన భార్య కూడా భోరున విలపిస్తూ కోర్టులోనే కుప్పకూలారు.

    English summary
    Mumbai business man convicted by POCso cout in Sexual abusement case of Bollywood actor. Vikas Sachdeva, a 41-year-old consultant, was convicted under sections of the POCSO Act and the Indian Penal Code.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X