Raj kundra Arrest: మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీలో రాజ్ కుంద్రా.. మరింత లోతుగా విచారణ
అశ్లీల సినిమాలు చిత్రీకరించి ఊహించని విదంగా పోలీస్ కేసులో ఇరుక్కున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పరిస్థితులు మరింత సిరియస్ గా మారుతున్నాయి. శిల్పా శెట్టి భర్త అరెస్ట్ అని వార్తలు రాగానే ఒక్కసారిగా ఆ న్యూస్ సౌత్ ఇండస్ట్రీలో కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇతర సెలబ్రెటీలు కూడా రాజ్ కుంద్రాపై విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా కారణంగా ఇబ్బంది పడిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
ఇక రాజ్ కుంద్రా కొత్త కేసు మరింత సిరియాస్ గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అరెస్ట్ అయిన అనంతరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి ఫలితం దక్కలేదు. రాజ్ కుంద్రా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జూలై 23 వరకు రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీలోనే ఉంచాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు ముంబై కోర్టు రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని జూలై 27, 2021 వరకు పొడిగించింది.

గ్యాప్ లేకుండా రాజ్ ను ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అడల్ట్ ఫిల్మ్ మాఫియాలో కేవలం రాజ్ కుంద్రా పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. హాట్ షాట్స్ వంటి యాప్స్ అతని అండ ద్వారే తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అందులో నటింపజేసేందుకు కొంతమందిని ట్రాప్ చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరైనా సెలబ్రెటీలు ఉన్నారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఏ ఛాన్స్ దొరికినా కూడా పోలీసులు వదిలిపెట్టాలని అనుకోవడం లేదట. మరింత గుట్టు లాగేందుకు రాజ్ కుంద్రాను విచారించనున్నారు. మరి ఈ కేసులు ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











