Pornography Case: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు.. విడుదల ఎప్పుడంటే?
అశ్లీల చిత్రాల షూట్ చేసిన కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 20) బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా బెయిల్ కోసం ఈ వ్యాపారవేత్త తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ నేషనల్ మీడియా వార్తా కథనం ప్రకారం రాజ్ కుంద్రాకు కొన్ని షరతులతో కూడా బెయిల్ ను రూ .50,000 పూచీకత్తుతో మంజూరు చేయబడినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా ఇదివరకే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా న్యాయస్థానం రిజెక్ట్ చేసింది.

బలిపశువును చేశారని..
అధికారులు కూడా అతనికి బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తరువాత సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు చేశారు. ఇక రాజ్ కుంద్రా కుంద్రా గత శనివారం (సెప్టెంబర్ 18) కోర్టు ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చాలా మోసాలు ఉన్నాయని సరైన సాక్ష్యాలు లేకుండానే తనను బలిపశువును చేశారని అలాగే ముంబై పోలీసులు ఇప్పటికే విచారణ పూర్తి చేశారని కుంద్రా పిటిషన్ లో పేర్కొన్నారు.

షరతులతో బెయిల్
ఫైనక్ గా రాజ్ కుంద్రాకు కొన్ని షరతులతో కూడా బెయిల్ ను రూ .50,000 పూచీకత్తుతో మంజూరు చేయబడినట్లు తెలుస్తోంది. ఇక ముంబై పోలీసులు బుధవారం (సెప్టెంబర్ 15) 1500 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.అశ్లీల కంటెంట్‌ను సృష్టించినందుకు అలాగే వాటితో బిజినెస్ చేసి రిలీజ్ చేసినందుకు రాజ్ కుంద్రాపై అలాగే మరో ముగ్గురు కేసు విచారణలో ఉన్నట్లు తెలియజేశారు.

హాట్‌షాట్, బోలీఫేమ్స్‌తో మాత్రమే సంబంధం
ఇక రాజ్ కుంద్రా న్యాయవాది ప్రశాంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసులు కావాలని బలవంతంగా తప్పుడు కేసులోకి లాగారని పేర్కొన్నారు. భారతదేశంలో శాశ్వత నివాసిగా తనకు సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని 10 నెలల పాటు హాట్‌షాట్, బోలీఫేమ్స్‌తో మాత్రమే సంబంధం కలిగి ఉన్నట్లు కుంద్రా వెల్లడించాడని పేర్కొన్నారు.
ఇక రాజ్ కుంద్రా బెయిల్ పై వివరణ ఇస్తూ.. వాస్తవానికి ఆర్టిస్టులు తమ కంటెంట్‌లను యాప్‌లలో అప్‌లోడ్ చేయడం వారి స్వంత నిర్ణయంతోనే జరిగింది కాబట్టి ఫిర్యాదులోని అంశాలు దరఖాస్తుదారుపై ఎలాంటి ప్రాథమిక నేరాన్ని వెల్లడించవు.. అని చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

విడుదల ఎప్పుడంటే
వ్యాపారవేత్త తరఫు న్యాయవాది బెయిల్ కోసం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత మంగళవారం రాజ్ కుంద్రా (సెప్టెంబర్ 21) విడుదల అవుతారని పేర్కొన్నారు. ఇక ఇటీవల రాజ్ కుంద్రా భార్య నటి శిల్పా శెట్టి ఛార్జ్ షీట్ కోసం తన ప్రకటనలో ఈ విధంగా చెప్పారు. కుంద్రా 2015 లో వయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేసే వరకు 2020 వరకు నేను డైరెక్టర్లలో ఒకరిని తప్పితే మరే విషయాలు నాకు తెలియదు అని అన్నారు.

షాక్ ఇచ్చిన షెర్లిన్ చోప్రా
ఇక హాట్‌షాట్‌లు లేదా బోలీఫేమ్ యాప్‌లు గురించి అయితే నాకు తెలియదు. నేను నా స్వంత పనిలో చాలా బిజీగా ఉన్నాను, అందుకే కుంద్రా వ్యాపారాలలో ఏమి చేస్తున్నాడో తెలియదు.. అని శిల్పా శెట్టి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అలా శిల్పా వివరణ ఇవ్వగానే కుంద్రా కంపెనీతో సంబంధం ఉన్న మోడల్ షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమెకు తెలియకుండానే అవన్నీ జరిగాయా అంటూ సెటైర్లు గట్టిగానే వేసింది.


Click it and Unblock the Notifications











