కంగనాకి స్ట్రాంగ్ వార్నింగ్.. అలా కాకుంటే ఇక వారెంట్, జాగ్రత్త!
ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద విషయాలు మాట్లాడుతూ అనేక విషయాల్లో అందరికీ టార్గెట్ అవుతున్న ఆమెకు తాజాగా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

జావేద్ అక్తర్ కేసు
కంగనాకు వ్యతిరేకంగా కొన్నాళ్ళ క్రితం గేయ రచయిత జావేద్ అక్తర్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఆమె స్టేట్మెంట్స్ తనని బాదిస్తున్నాయని ఆయన కోర్టుకు ఎక్కారు. భారత శిక్షాస్మృతిలోని 499 మరియు 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం కలిగిస్తున్న క్రమంలో ఆయన కేసు నమోదు చేశారు. కంగనా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ "బాలీవుడ్ ఆత్మాహుతి ముఠా"లో భాగమని, "ఆయన దేని నుంచి అయినా బయటపడగలరు" అని వ్యాఖ్యానించారు.

సుశాంత్ మరణం తరువాత
గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత రచయిత జావేద్ అక్తర్ గురించి కంగనా రనౌత్ పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాలీవుడ్‌లో జావేద్ అక్తర్ ది కక్షసాధింపు అని కంగనా ఆరోపించింది. దీని తరువాత జావేద్ అక్తర్ కంగనా పై పరువు నష్టం కేసు పెట్టారు.

ఇక వారెంట్
గేయ రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కంగనా రనౌత్ కోర్టుకు హాజరు కావడానికి అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చివరి అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణకు హాజరు కాకపోతే నటిపై బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఇది కరెక్ట్ కాదు
కంగనా తరఫున హాజరైన న్యాయవాది కంగనా దేశంలో లేరని, అందువల్ల మంగళవారం (జూలై 27) విచారణ సందర్భంగా ఆమె హాజరుకారని కోర్టుకు తెలిపారు. అందుకే ఆమె తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరింది.ఇక జావేద్ అక్తర్ తరఫున హాజరైన న్యాయవాది జే భరద్వాజ్ ఈ మినహాయింపు వ్యతిరేకించారు.

కరోనా సేఫ్
కంగనా ఈరోజు హాజరు కానందున బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత మరియు కరోనా మహమ్మారి సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) కారణంగా, అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ ఆర్ ఖాన్ ఆమెకు ఈ రోజు మినహాయింపునిచ్చారు. అయితే, కంగనా మరుసటి వాయిదా రోజు అంటే సెప్టెంబర్ 1న హాజరు కాకపోతే, ఆమెపై బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే చివరిగా ఆమె పంగా అనే సినిమాలో నటించింది. ఇక ఆమె తలైవి అనే సినిమాలో జయలలిత నిజజీవిత పాత్రలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఆమె దాకడ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











