అమితాబ్, అనుష్క శర్మకు ట్రాఫిక్ పోలీసులు షాక్.. నెటిజన్ల ఫిర్యాదుతో జరిమానా?
ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి.. టూ వీలర్‌పై ప్రయాణించిన అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మపై ముంబై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. ముంబైలో ట్రాఫిక్ జామ్ కావడంతో షూటింగ్ లొకేషన్‌కు సకాలంలో చేరాలనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనంపై అమితాబ్, అనుష్క శర్మ ప్రయాణించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది నెటిజన్లు నటన, ప్రొఫెషన్‌పై వారికి ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని ట్రోల్ చేశారు. అయితే టూ వీలర్ ప్రయాణం సందర్భంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆ వివరాల్లోకి వెళితే..
అమితాబ్ బచ్చన్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టి.. నన్ను సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేర్చిన ద్విచక్ర వాహనదారుడికి థ్యాంక్స్ అని అన్నారు. నీవు ఎవరో తెలియదు కానీ.. నేను లిఫ్ట్ అడగ్గానే.. వెంటనే అంగీకరించి నన్ను నీ వాహనంపై తీసుకెళ్లావు. సకాలంలో లొకేషన్‌కు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొన్న నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లావు. క్యాప్, పసుపు పచ్చని టీషర్ట్ ధరించిన వ్యక్తికి థ్యాంక్స్ అని అమితాబ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ టూవీలర్‌పై ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్ ధరించలేదు. డ్రైవర్ గానీ, డ్రైవర్ వెనుక ఉన్న పాసింజర్ గానీ హెల్మెట్ ధరించలేదు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గమనించాలంటూ నెటిజన్లు ట్రాఫిక్ విభాగం దృష్టికి తీసుకొచ్చారు. నెటిజన్లు చేసిన ఫిర్యాదుపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించి.. మేము ఆ పనిలోను ఉన్నాం అంటూ కామెంట్ చేశారు.
అయితే అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మకు లిఫ్ట్ ఇచ్చిన టూ వీలర్ డ్రైవర్లకు ముంబై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తే.. ఉత్త పుణ్యానికి బుక్ అయిపోయారే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తీసుకొనే చర్యపై అమితాబ్, అనుష్క శర్మ ఏ విధాంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్‌తో గణపతి, ఆ తర్వాత ఘూమెర్, ఉమేష్ క్రానికల్స్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇక అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. సుమారు 5 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. క్రికెటర్ జులాన్ గోస్వామి బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది. అనుష్క నటించిన చివరి చిత్రం షారుక్ నటించిన జీరో సినిమా అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











