Just In
- 3 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 4 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 6 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, మోడీ నాయకత్వంలో ప్రభుత్వం: పవన్ కళ్యాన్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రముఖ హోటల్‌పై దాడి.. ముగ్గురు సినీ తారలకు విముక్తి
వ్యభిచార గృహాలపై ముంబై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. కొద్దిరోజులుగా సోషల్ సర్విస్ (ఎస్ఎస్) బ్రాంచ్ పోలీసులు నిరవధిక దాడులు నిర్వహిస్తూ నరకకూపంలో చిక్కుకున్న వర్ధమాన తారలకు విముక్తిని కల్పిస్తుండటం గమనార్హం. బుధవారం ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు గురువారం కూడా అదే దాడిని కొనసాగించి హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ దందాను బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ముందస్తు సమాచారంతో
ముందస్తు సమాచారంతో ముంబై సోషల్ సర్వీస్ (ఎస్ఎస్) అంధేరి సబర్బన్‌లోని విలాసవంతమైన త్రీ స్టార్ హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సినీ ఆర్టిస్టులతోపాటు మహిళను అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో ఒక యువతి ఓ మైనర్ అని పోలీసులు పేర్కొన్నారు.

యువతులను బలవంతంగా
ముంబై పోలీసుల వెల్లడించిన ప్రకారం.. యువతులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించాం. ప్రముఖ హోటల్‌లో సోదాలు నిర్వహించగా దందాను కొనసాగిస్తున్న ప్రియాశర్మ అనే మహిళను పట్టుకొన్నాం. ఆమెను విచారించగా అసలు విషయం బయటపెట్టడంతో సంఘటనాస్థలంలోనే అరెస్ట్ చేశాం అని తెలిపారు.

కండివాలిలో టూర్స్ అండ్ ట్రావెల్స్
నిందితురాలు ముంబైలొని తూర్పు కండివాలిలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలోనే ఇలాంటి నీచమైన వ్యవహారాల్లోకి దిగారు. కొద్దికాలంగా సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. ఆర్థికంగా ఇబ్బంది పడే వారిని టార్గెట్ చేసుకొని ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు అని ఇన్స్‌పెక్టర్ సందేశ్ రావలే పేర్కొన్నారు.

ఓ గాయని, ఇద్దరు తారలు
వ్యభిచారం కూపం నుంచి విముక్తి కలిగించిన వారిలో ఓ నటి, మరో గాయని కూడా ఉన్నారు. వీరిద్దరు సావధాన్ ఇండియా అనే టెలివిజన్ క్రైం షోలో నటించారు. మరొకరు మరాఠీ మూవీ, సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రియా శర్మపై కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు.

వరుస దాడులతో
బాలీవుడ్‌లో క్యాస్టిండ్ డైరెక్టర్‌గా పనిచేసే నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్యను బుధవారం సోషల్ సర్విస్ (ఎస్ఎస్) బ్రాంచ్ పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాలు ఎరవేసి అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం అందుకొన్న పోలీసులు పక్కా ప్లాన్ వేసి దాడి చేశారు. నవీన్ ఒక్కొ కస్టమర్ నుంచి రూ.60 వేల వసూలు చేసి దందాను నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నవీన్ తన స్నేహితులు అజయ్ శర్మ, విజయ్ సహకారంతో ఐదేళ్లుగా సెక్స్ రాకెట్‌ను ఐదేళ్లుగా నడుపుతున్నారు అనే విషయాన్ని పోలీసులు తెలిపారు.