ప్రముఖ నటుడిపై రేప్ కేసు నమోదు? కారణం ఆ హీరోయినా?
ముంబై పోలీసులు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోళి మీద రేప్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా వార్తా సంస్థ ఎఎన్ఐ ఓ ఫ్లాష్ న్యూస్ విడుదల చేసింది. అయితే ఎవరి కంప్లయింట్‌పై వారు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఆదిత్య పంచోళిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కారణం.... బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అనే వాదన వినిపిస్తోంది. ఆదిత్య పంచోలి తనపై హింసకు పాల్పడ్డాడని, సెక్సువల్ హరాస్మెంట్ చేశాడని కొన్ని రోజుల క్రితం కంగనా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో అతడితో రిలేషన్ షిప్‌లో ఉన్న కంగనా
గతంలో ఆదిత్య పంచోళి, కంగనా రనౌత్ కలిసి ఉన్నారు. ఆ సమయంలో ఆదిత్య పంచోళి ఆమెపై డొమెస్టిక్ వయొలెన్స్‌కు పాల్పడ్డాడని, సెక్సువల్ హరాస్మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై కంగనా రనౌత్ కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పంచోళి భార్య ఏమన్నారంటే?
అయితే పంచోళి భార్య జరీనా వాహెబ్ మాత్రం... కంగనా రనౌత్ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. తన భర్తతో కంగనా రనౌత్ సహ జీవనం చేసిందని, ఇష్ట ప్రకారమే అతడితో జీవించిందని, అయితే ఇపుడు విడిపోయాక రేప్ చేశాడని కేసు పెట్టడం దారుణమని పేర్కొన్నారు.

క్లారిటీ రావాల్సి ఉంది
కాగా... ముంబై పోలీసులు ఆదిత్య పంచోళి మీద నమోదు చేసిన రేప్ కేసుపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కంగనా రనౌత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయంలో శుక్రవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కంగనా రనౌత్
కంగనా రనౌత్ సినిమాల విషయానికొస్తే.... ఈ ఏడాది ప్రారంభంలో ‘మణికర్ణిక' సినిమాతో విజయం అందుకున్న కంగనా రనౌత్... ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా ' అనే సినిమాలో నటిస్తోంది. జులై 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. దీంతో పాటు పంగా, జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











