twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌పై విష ప్రయోగం జరిగిందా? పోలీసుల చేతికి విసేరా రిపోర్టు.. అనుమానాలపై క్లారిటీ

    |

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. ఈ యువ నటుడి మరణం తర్వాత రోజు రోజుకు సందేహాలు జోరందుకోవడంతో వీలైనంత మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలాంటి క్రమంలోనే గతవారం పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టును కూపర్ హాస్పిటల్ వైద్యబృందం నుంచి అందుకొన్న ముంబై పోలీసులు పలువురిని విచారించారు. తాజాగా బాంద్రా పోలీసుల చేతికి విసేరా రిపోర్టు అందింది. ఈ ఆ రిపోర్టులో ఏమున్నదంటే..

    ఆత్మహత్య వెనుక కారణాలపై

    ఆత్మహత్య వెనుక కారణాలపై

    జూన్ 14న సూసైడ్ చేసుకొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును యాక్సిండెంటల్‌గా నమోదు చేసుకొన్న బాంద్రా పోలీసులు ఆ తర్వాత విచారణలో భాగంగా వెల్లడైన వాస్తవాలను బేరిజు వేసుకొని ఇటీవల ఆ కేసును సూసైడ్ కేసుగా మార్చారు. దర్యాప్తును వేగవంతం చేసి.. సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమై ఉంటాయనే కోణంలో విచారణ చేపట్టారు.

    హీరోయిన్లు, స్నేహితులతోపాటు 28 మందిని విచారణ

    హీరోయిన్లు, స్నేహితులతోపాటు 28 మందిని విచారణ

    ఇదిలా ఉండగా, గత 15 రోజులకుపైగా విచారణలో ముంబై పోలీసులు అనేక విషయాలను అధికారికంగా ధృవీకరించుకొన్నారు. దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీ, సుశాంత్ స్నేహితుడు ముఖేష్ చబ్రా, ప్రియురాలు రియా చక్రవర్తి, క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను రెండుసార్లు విచారించడంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై ఆసక్తి పెరుతుగుతున్నది. ఇలా దాదాపు 28 మందిని విచారణకు పిలిచి ప్రశ్నించారు.

    విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో

    విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో

    పూర్తిస్థాయి రిపోర్టులో శ్వాస అందకపోవడం వల్లే సుశాంత్ మరణం సంభవించిందనే విషయాన్ని ధృవీకరించారు. ఆ క్రమంలో సుశాంత్‌పై ఏదైనా విషప్రయోగం జరిగిందా అని తెలుసుకోవడానికి శరీరంలోని కీలక అవయవాల (విసేరా)ను ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. విసేరా రిపోర్టులో నెగిటివ్ ఫలితాలు రావడంతో పోలీసులు విషయ ప్రయోగం జరగలేదనే విషయంపై నిర్ధారణకు వస్తున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    ఫొరెన్సిక్ రిపోర్టు నెగిటివ్

    ఫొరెన్సిక్ రిపోర్టు నెగిటివ్

    తాజా ఫొరెన్సిక్ నిపుణుల విభాగం ముంబై పోలీసులకు సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును అందజేశారు. విషయం ప్రయోగం జరిగిందా అనే కోణంలో పరిశోధన చేసిన ఫొరెన్సిక్ విభాగానికి ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు, కెమికల్, విషపూరితమైన ఆనవాళ్లు ఏమి కనిపించలేదని రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో సుశాంత్‌పై ఎలాంటి విష ప్రయోగం జరుగలేదనే విషయాన్ని మరోసారి తమ దర్త్యాప్తులో తెలుసుకొన్నారు.

    English summary
    Sushant Singh Rajput sucide incident has sent Shock waves everyone national wide. As the part of the investigation, Mumbai Police receives Sushant Singh Viscera Report, That forensic Report come out negative and mentioned no foul play in this death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X