twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranveer Singh: న్యూడ్ ఫొటో షూట్ వివాదం.. ముంబై పోలీస్ స్టేషన్లో రణ్‌వీర్‌!

    |

    బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్ పై ఇటీవల పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ మేగజైన్ కోసం నిర్వహించిన ఫోటోషూట్ లో రణవీర్ సింగ్ గతంలో ఎప్పుడు లేని విధంగా నగ్నంగా కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నెటిజెన్లు కూడా ఆ ఫోటోలపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక మొత్తానికి పలు కేసులు నమోదు కావడంతో సోమవారం రోజు ఈ నటుడు పోలీస్ స్టేషన్లో హాజరయ్యాడు. పూర్తి వివరాల్లోకి.

    నగ్నంగా ఫొటో షూట్

    నగ్నంగా ఫొటో షూట్

    నటుడిగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రణ్‌వీర్‌ సింగ్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో సరికొత్త కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతను ఎవరు ఊహించని విధంగా నగ్నంగా ఒక ఫోటోషూట్ లో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    కోట్లల్లో రెమ్యునరేషన్

    కోట్లల్లో రెమ్యునరేషన్

    జూలై నెలలో పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్‌ సింగ్ నిర్వహించిన ఫోటోషూట్ లో శరీరంపై నూలుపోగు లేకుండా ఫోటోలకు స్టిల్ ఇచ్చాడు. ఇక అతను ఆ విధంగా న్యూడ్ ఫోటోషూట్ నిర్వహించడానికి కోట్లల్లో పారితోషిషికం కూడా తీసుకున్నట్లుగా అనేక రకాల కథనాలు వచ్చాయి. దాదాపు ఒక సినిమాకు తీసుకున్నంత రేంజ్ లోనే అతను రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా టాక్ వచ్చింది.

    తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు

    తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు

    అయితే ఆ ఫోటోషూట్ పై సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక కొంతమంది అయితే రణ్‌వీర్‌ సింగ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆ వివాదం ఎంత వైరల్ అవుతున్నా కూడా వీరు పెద్దగా స్పందించలేదు.

    పోలీస్ స్టేషన్ లో రణ్‌వీర్‌

    పోలీస్ స్టేషన్ లో రణ్‌వీర్‌

    ఇక ఫైనల్ గా రణ్‌వీర్‌ సింగ్ సోమవారం రోజు ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ స్టార్ ఉదయం 7 గంటలకు చెంబూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని 9 గంటల వరకు అక్కడే విచారణలో పాల్గొన్నాడు. అవసరమైతే విచారణ అధికారి మరోసారి సమన్లు ​​పంపుతారని అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

    రెండు గంటల విచారణ

    రెండు గంటల విచారణ

    రణవీర్ పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 292, 294 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని 509 అలాగే 67(A) సెక్షన్ కింద కేసు నమోదు చేయబడింది. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు, అసభ్యతను కించపరిచినందుకు రణ్ వీర్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

    ఇక రెండు గంటల పాటు విచారణలో పాల్గొన్న రణ్ వీర్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అనంతరం ఈ స్టార్ మీడియా కంట పడకముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    English summary
    Mumbai Police records Bollywood actor Ranveer Singh’s statement on naked photoshoot..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X