twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంజాయి ఇష్యూ: ప్రముఖ నటుడికి పోలీసుల వార్నింగ్, దొరికితే జైలుకే...

    |

    బాలీవుడ్ యాక్షన్ సిరీస్ 'ధూమ్' సినిమాల్లో బైక్ వీరుడిగా అందరికీ సుపరిచితమైన ఉదయ్ చోప్రా ఇటీవల నిషేధిత మత్తు పదార్థం గంజాయి విషయమై ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై చాలా పెద్ద చర్చ జరగుతోంది. గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేయాలని, దీని వాడకం మన సంస్కృతిలో భాగం అంటూ ఉదయ్ చోప్రా ఇటీవల వ్యాఖ్యానించారు. తనకు గంజాయి వాడే అలవాటు లేదంటూనే దీన్ని చట్టబద్దం చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా వస్తుంది, దీని వల్ల ఎన్నో మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.

    ఉదయ్ చోప్రాకు పోలీసుల దుమ్మదిరిగే కౌంటర్

    ఉదయ్ చోప్రాకు పోలీసుల దుమ్మదిరిగే కౌంటర్

    ఉదయ్ చోప్రా గంజాయి ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడంతో ముంబై పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఉదయ్ చోప్రాకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. భారతీయ పౌరుడిగా మీకు పబ్లిక్ ఫ్లాట్‌పాంలో మీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందంటూనే.... గంజాయి నిషేధించబడిన మత్తు పదార్థం, అది ఎవరి వద్ద లభించినా వారు జైల్లో ఊచలు లుక్కపెట్టాల్సిందే అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.

    కఠిన చర్యలు తప్పవు

    కఠిన చర్యలు తప్పవు

    గంజాయి సేవించినా, ఎవరి వద్ద అయినా లభించినా, దాన్ని రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం 1985 ప్రకారం శిక్షార్హులు. ఈ విషయం అందరికీ చెప్పండి అంటూ ఉదయ్ చోప్రాకు ముంబై పోలీసులు సూచించారు.

     ఉదయ్ గంజాయి ఇష్యూపై మిశ్రమ స్పందన

    ఉదయ్ గంజాయి ఇష్యూపై మిశ్రమ స్పందన

    గంజాయిని చట్టబద్దం చేయాలనే ఉదయ్ చోప్రా చేసిన ట్వీట్ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు అతడికి మద్దతు తెలుపగా, మరికొందరు గంజాయి చట్టబద్దం చేస్తే దేశ యువత మత్తులో జోగుతారు, దీని వల్ల దేశం అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వ్యతిరేకించారు. ఎవరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా తను చెప్పాలనుకున్నది చెప్పానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు ఉదయ్ చోప్రా.

    సంస్కృతిలో భాగం అంటూ..

    సంస్కృతిలో భాగం అంటూ..

    గంజాయి వాడకం మన సంస్కృతిలో భాగం ఎలా అవుతుంది? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఉదయ్ స్పందిస్తూ... హోళి వేడుకల్లో వాడే భాంగ్ తయారీలో గంజాయి వాడతారు, మహాశివరాత్రి వేడుకల్లో సాధువులు గంజాయి స్మోక్ చేస్తారు అంటూ సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్లను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.

    English summary
    "I feel India should legalize marijuana. Firstly, It's part of our culture. Secondly, I think if legalized and taxed it can be a huge revenue source. Not to mention it will remove the criminal element associated with it. Plus and most importantly it has a lot of medical benefits," Uday Chopra tweeted. In a tweet, the Mumbai Police warned Uday that although he is "privileged to express (his) view on a public platform", the possession, consumption and transportation of marijuana continues to be punishable under the Narcotic Drugs and Psychotropic Substances Act, 1985.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X