twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసు: పోలీసుల చేతికి సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ విషయం వెలుగులోకి..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు అనేక కోణాల్లో జరుపుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఎలాంటి చిన్న ఆధారం దొరికినా ఈ కేసులో బలమైన సాక్ష్యాలను లభిస్తాయా? అనే విధంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికి సుశాంత్‌తో సంబంధం, ఆయన ఆత్మహత్యతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని భావించినా.. వారిని వదిలి పెట్టకుండా విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు మరో అడుగు ముందడుగు వేశారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పోలీసులు కొంత పురోగతిని సాధించినట్టు కనిపిస్తున్నది. దానికి సంబంధించిన విషయంలోకి వెళితే..

    Recommended Video

    Sushant Singh Rajput ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ పోలీసుల స్వాధీనం, వెలుగులోకి షాకింగ్ విషయం !
    డేట్స్ సమస్య వల్లే వీలు కాలేదు

    డేట్స్ సమస్య వల్లే వీలు కాలేదు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మూడు గంటలపాటు విచారణ జరిపారు. సుశాంత్‌తో ఉన్న పరిచయం, ఆయనకు ఇవ్వజూపిన ఆఫర్ల గురించి అడిగి తెలుసుకొన్నారు. రామ్‌లీలా బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రాల్లో ఆఫర్లు ఇచ్చాను. కానీ అప్పటికే ఆయన మరో సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల డేట్స్ సమస్య తలెత్తిందని భన్సాలీ చెప్పిన విషయాన్ని బాంద్రా పోలీసులు రికార్డు చేసుకొన్నారు.

    సుశాంత్ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం

    సుశాంత్ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం

    ఇదిలా ఉండగా, మంగళవారం రోజున సుశాంత్ ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బాంద్రా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. జూన్ 14వ తేదీకి ముందు గానీ, ఆ తర్వాత గానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటిలోకి ప్రవేశించారా? అనే కోణంలో వివరాలను సేకరించేందుకు బాంద్రా పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

    సుశాంత్ ఇంటిలో సీసీటీవీ కెమెరాలు లేవని

    సుశాంత్ ఇంటిలో సీసీటీవీ కెమెరాలు లేవని

    బాంద్రా పోలీసుల దర్యాప్తులో సుశాంత్ ఫ్లాట్‌కు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఫ్లాట్‌లో సీసీటీవీ కెమెరాలు అమర్చలేదనే విషయాన్ని తాజాగా పోలీసులు తెలుసుకొన్నారు. బిల్డింగ్‌లో అమర్చిన కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్‌ను మాత్రం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవనే కోణంలో సిబ్బందిని ఆరా తీసినట్టు తెలిసింది.

    ఇప్పటి వరకు 34 స్టేట్‌మెంట్స్

    ఇప్పటి వరకు 34 స్టేట్‌మెంట్స్

    జూన్ 14వ తేదీన సుశాంత్ మరణం తర్వాత చాలా మందిని బాంద్రా పోలీసులు ప్రశ్నించారు. భన్సాలీ విచారణ తర్వాత మీడియాకు విడుదల చేసిన వివరాలను బట్టి, ఈ కేసులో ఇప్పటి వరకు 34 స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. అవసరమైతే ఇంకా కొంత మందిని విచారిస్తామని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

    English summary
    Sushant Singh Rajput suicide case: All possibilities are exploring in this sensation mystery case. After questioning of Sanjay Leela Bhansali, Mumbai Police seized CCTV footage of Sushant Singh Rajput building.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X