సీక్రెట్‌గా హాట్ హీరోయిన్ పెళ్లి.. కమెడియన్‌తో మర్డర్ 2 నటి వివాహం!
బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్ సులగ్న పాణిగ్రహి పెళ్లి చేసుకోవడం సెన్సేషనల్‌గా మారింది. అయితే తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టిన అందాల భామ శనివారం తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెళ్లి వార్తను పోస్టు చేయడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. సులగ్న పాణిగ్రహి పెళ్లికి సంబంధించిన వివరాలు మరింతగా...

మర్డర్ 2 చిత్రంతో హాట్ హాట్‌గా
బాలీవుడ్ చిత్రం మర్డర్ 2లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్న సులగ్న్ పాణిగ్రహి ఆ తర్వాత తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. 2011లో ఇమ్రాన్ హష్మీతో కలిసి హాట్ హాట్‌గా నటించింది. మర్డర్ 2 తర్వాత ఇష్క్ వాలా లవ్, ఇసాయి, గురు దక్షిణ, రైడ్ చిత్రాలతో మరింత పాపులారిటీని సంపాదించుకొన్నది.

కమెడియన్‌తో అఫైర్ అంటూ..
అయితే గత కొద్దికాలంగా బిస్వా కల్యాణ్ రథ్ అనే కమెడియన్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై బిస్వా, సులగ్న స్పందించలేదు. కానీ వారి మధ్య డేటింగ్ వ్యవహారం మీడియాలో నానుతూనే ఉంది. అలాంటి వార్తలు వైరల్ అవుతుండగానే పెళ్లి వార్తను వెల్లడించి అభిమానులకు షాకిచ్చింది.

డిసెంబర్ 9న బిస్వాతో వివాహం
బిస్వా కల్యాణ్ రథ్, సులగ్న వివాహం డిసెంబర్ 9వ తేదీన సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. చాలా రోజుల తర్వాత డిసెంబర్ 19వ తేదీన తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు,రిసెప్షన్ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి.

మా జీవితం మరింత సుఖ: సంతోషాలతో
యువ హీరోయిన్ సులగ్న తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన పెళ్లి విషయాలను వెల్లడిస్తూ.. బిస్వా ఇక నుంచి బ్రహ్మచారి కాదు. ఇప్పడు వివాహితుడు. సింగిల్ లైఫ్ ఇక ముగిసిన కథ అంటూ ఓ ఫోటోకు క్యాప్షన్‌గా పెట్టింది. రెండో ఫోటోను పోస్టు చేసిన సులగ్న మా జీవితంలో మరింత సుఖ: సంతోషాలతో సాగుతుందని భావిస్తున్నాం అంటూ పోస్టు పెట్టింది.


Click it and Unblock the Notifications











