Breaking: సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. విషమంగా ఆరోగ్య పరిస్థితి!

ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరగడం సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అగంతకుడు కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించి.. సర్జరీ నిర్వహిస్తున్నట్టు వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన బాలీవుడ్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సైఫ్ ఆలీ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి హాస్పిటల్‌ వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ నిరజ్ ఉత్తమని స్పందిస్తూ.. సైఫ్‌ను గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. ఆయనను తెల్లవారు జామున ఉదయం 3.30 గంటలకు హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆయనకు మొత్తం 6 గాయాలు అయ్యాయి. ఆయన శరీరంపై రెండు చోట్ల లోతుగా బలమైన గాయాలున్నాయి. ఒక గాయం వెన్నముకకు సమీపంలో జరిగింది. మేము ఆపరేషన్ చేస్తున్నాం. న్యూరోసర్జన్ నితిన్ డాంగే ఆపరేషన్ నిర్వహిస్తున్నాడు.కాస్మటిక్ సర్జన్ లీనా జైన్, అనేస్తేషియన్ నిషా గాంధీ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. సర్జరీ తర్వాతే ఆయన ప్రాణాలకు ఏ రేంజ్‌లో హానీ జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తాం అని తెలిపారు.

Murder attack on Saif Ali Khan at Mumbai s Bandra residence

సైఫ్ ఆలీ ఖాన్‌ దాడి ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున అగంతకుడు ఆయన ఇంట్లోకి చొరబడ్డాడు. ముందుగా పని మనిషితో వాగ్వాదం పెట్టుకొన్నారు. ఆ విషయం గ్రహించిన సైఫ్.. అగంతకుడిని నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే సైఫ్‌తో వాదన తర్వాత ఆయనపై ఎటాక్ చేసి గాయపరిచాడు. ఈ ఘటనను బంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సైఫ్‌పై అగంతకుడు కత్తితో దాడి చేశాడు. దాంతో ఆయనకు ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. దాడి తర్వాత అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం ముంబై పోలీసులు లుకౌట్ జారీ చేసి.. వెతుకుతున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటన తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఆయనను 3.30 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు అని లీలావతీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: saif ali khan bollywood mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X