ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు పితృవియోగం.. సినీ ప్రముఖుల పరామర్శ
బాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి ఇంట్లో విషాదం నెలకొన్నది. కొన్నేళ్లుగా పార్కిన్సన్, ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రబోధ్ చక్రవర్తి ఆదివారం కన్నుమూశారు. అయితే ఈ మరణ వార్త ఆలస్యంగా వెలుగుచూసింది. మరణానికి ముందు మూడు నెలల నుంచి ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ప్రీతమ్, ఆయన తల్లి, సోదరి మూడునెలలుగా హాస్పిటల్‌లోనే ఉన్నారు. గత రెండేళ్లుగా పార్కిన్సన్, ఆల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. గత ఆదివారం రాత్రి పోరాటంలో అలిసిపోయిన ప్రభోద్ తుది శ్వాస విడిచారు అని ప్రీతమ్ సన్నిహితులు తెలిపారు.

ముంబైలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా కొనసాగుతుండటంతో కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ప్రభోద్ అంత్యక్రియలు అంబోలి శ్మాశన వాటికలో జరిగాయి. ప్రీతమ్ సన్నిహితులు ఆయన తండ్రికి కన్నీటి వీడ్కోలు తెలిపారు.
పితృ వియోగంతో బాధపడుతున్న ప్రీతమ్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రీతమ్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని, ప్రభోద్ ఆత్మకు శాంతి చేకూరాలిని ప్రార్థించారు. పలువురు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.


Click it and Unblock the Notifications











