Bappi Lahiri బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన టాప్ 10 సాంగ్స్.. వింటే ఎప్పటికి మర్చిపోలేరు

బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూయడం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇండియన్ మ్యూజిక్ వరల్డ్ లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన బప్పీ లాహిరి బౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పటికి ఆయన పాటలతో మాత్రం అందరి మనసులో నిత్యం బ్రతికే ఉంటారు అని చెప్పవచ్చు. ఎలాంటి పాట కంపోజ్ చేసినా కూడా బప్పీ లహరి అందులో ఏదో ఒక కొత్తధనం ఉండేలా చూసుకుంటాడు. ఇక ఆయన సినీ జీవితంలో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇక వాటిలో టాప్ 10 సాంగ్స్ పై ఒక లుక్కేద్దాం పదండి..

 ఎన్నిసార్లు విన్నా

ఎన్నిసార్లు విన్నా

తన కెరీర్‌లో 700 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించిన ఆయన, బాలీవుడ్‌లోని రెండు తరాల నటులకు తన గాత్రాన్ని అందించారు. ఇక ఎస్ జానకి, బప్పి లాహిరి పాడిన యార్ బినా చైన్ కహా రే పాట 1985 సాహెబ్ చిత్రంలోనిది. ఎన్నిసార్లు విన్నా ఈ సాంగ్ బోర్ కొట్టదు. ఇందులో అనిల్ కపూర్, అమృతా సింగ్ నటించారు. అప్పట్లో ఈ పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

డిస్కో డ్యాన్సర్

డిస్కో డ్యాన్సర్

1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక చాలా కాలం తరువాత గోల్ మాల్ 3లో కూడా ఆ పాటను రీమిక్స్ చేయగా మంచి క్రేజ్ అందుకుంది. కేవలం ఒక దశలోనే కాకుండా అన్ని తరాల వారితో స్టెప్పులు వేయించే విధంగా బప్పీ లహరి మ్యూజిక్ అందించేవారు. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అనే పాట పాడని వారు ఉండరేమో అనేలా అప్పట్లో ఆ పాట ట్రెండ్ సెట్ చేసింది.

 మోస్ట్ పాపులర్ సాంగ్..

మోస్ట్ పాపులర్ సాంగ్..

1982 లో వచ్చిన ఆప్ కి కథిర్ సినిమాలోని బప్పీ లహరి అందించిన ఒక సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన కెరీర్ లోనే మోస్ట్ పాపులర్ సాంగ్ అని చెప్పవచ్చు. బొంబాయి సే ఆయా మేరీ దోస్త్ అనే సాంగ్ అప్పట్లో పార్టీలలో ఎక్కువగా వినిపించేది. బప్పీ లహరి కెరీర్ కూడా ఒక్కసారిగా ఆ పాటతో ఊపందుకుంది.

ట్రెండ్ సెట్ సాంగ్స్

ట్రెండ్ సెట్ సాంగ్స్

కోయి యహన్ అహ నాచే నాచే అనే పాట కూడా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. 1979లో విడుదలైన ఈ పాటను బప్పి కలిసి ఉషా ఉతుప్ పాడారు. నేటికీ ఈ పాట వింటే డ్యాన్స్ చేయకుండా వుండరు. తానేదార్‌లోని తమ్మ తమ్మ పాట 1989లో బెస్ట్ హిట్ సాంగ్. బప్పి లాహిరి, అనురాధ ఈ పాటను పాడారు. ఇందులో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ హైలెట్ గా నిలిచారు. రీసెంట్ గా వరుణ్ ధావన్, అలియా భట్ నటించిన బద్రీనాథ్ కి దుల్హనియా లో ఈ పాటను రీమిక్స్ చేశారు.

డర్టీ పిక్చర్ బెస్ట్ సాంగ్

డర్టీ పిక్చర్ బెస్ట్ సాంగ్

సిల్క్ స్మితా జీవిత ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసిన సాంగ్ ఉలాల్లా ఊలాల్లా.. ఈ పాట కూడా యువతలో మంచి క్రేజ్ అందుకుంది. ట్యూన్ మారి ఎంట్రియాన్ పాటతో కూడా బప్పీ లహరి ఇండస్ట్రీని షేక్ చేశారు. ప్రియాంక చోప్రా-రణవీర్ సింగ్ ఆ పాటతో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు.

 ఆ పాటలు కూడా సెన్సేషన్

ఆ పాటలు కూడా సెన్సేషన్

ఆజ్ రపాట్ జాయిన్.. అనే పాటతో బప్పీ లహరి తనపై ఉన్న ఒక విమర్శను కూడా చేరిపేసుకున్నారు. తను రొమాంటిక్ పాటలను కూడా మనసుకు హత్తుకునేలా కంపోజ్ చేయగలను అని అని నిరూపించారు.

ఈ రొమాంటిక్ పాట నమక్ హలాల్ (1982) అనే చిత్రంలోనిది. అలాగే దే దే ప్యార్ దే పాటతో పాటు గుతుర్ గుతుర్ అనే సాంగ్ కూడా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X