Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కరోనాతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. శోకసంద్రంలో సల్మాన్, బాలీవుడ్ ప్రముఖులు
ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ఇక లేరు. వాజిద్ ముంబైలోని చెంబూరులోని సురానా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో బాలీవుడ్ లోకం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనైంది. వాజిద్ మృతి వార్తను నా సోదరుడు ఒకలేరు. మనల్ని వదిలివెళ్లారు అంటూ ప్రముఖ సింగర్ సోను నిగమ్ ధృవీకరించారు. వాజిద్ మృతి వార్తను తెలుసుకొన్న బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. వాజిద్ గురించి మరిన్ని వివరాలు..
Recommended Video

కరోనావైరస్‌తో
వాజిద్ ఖాన్ వయసు 42 సంవత్సరాలు. కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజిద్ కరోనావైరస్ బారిన పడ్డారు. కొవిడ్ 19 చికిత్స పొందుతూ ఆకస్మిక మరణించారు. సంగీత ద్వయం సాజిద్, వాజిద్‌లో ఒక్కరికిగా పలు సినిమాలకు ప్రేక్షకాదరణ పొందిన సంగీతాన్ని అందించారు. వీరిద్దరూ అందించిన సినిమాలు సంగీత ప్రియులను హుషారెత్తించాయి.

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత
వాజిద్ మరణం గురించి మ్యూజిక్ డైరెక్టర్ సలీం మర్చంట్ మీడియాతో మాట్లాడుతూ.. కొద్దినెలల క్రితం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆతర్వాత పలు అవయవాల సమస్యలు తలెత్తాయి. ఇటీవల కిడ్నీ ఇన్‌ఫెక్షన్ కూడా తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. గత నాలుగు రోజులుగా వెంటిలెటర్‌పై ఉన్నారు. కిడ్నీ సమస్య తీవ్రం కావడం ఆరోగ్య విషమించి ఆయన మరణించారు అని తెలిపారు.

సల్మాన్ ఖాన్ సినిమాలకు సంగీతం
సల్మాన్ ఖాన్‌కు వాజిద్ అత్యంత సన్నిహితుడు. సాజిద్, వాజిద్ ద్వయాన్ని ముందునుంచి సల్మాన్ ప్రొత్సహిస్తున్నారు. సాజిద్, వాజిద్ ఇద్దరు కలిసి 1998లో సల్మాన్ ఖాన్ నటించిన ప్యార్ కియా తో డర్నా క్యా చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సల్మాన్ నటించిన దబాంగ్ సిరీస్‌తోపాటు చోరి చోరి, హలో బ్రదర్, వాంటెటడ్, ముజ్‌సే దోస్తి కరోగి లాంటి సూపర్ హిట్లకు వీరిద్దరే మ్యూజిక్ అందించారు. ఇటీవల విడుదలైన భాయ్ భాయ్ వీడియో ఆల్బమ్‌కు కూడా వీరిద్దరే మ్యూజిక్ అందించడం తెలిసిందే.

బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
వాజిద్
మృతికి
బాలీవుఢ్
ప్రముఖులు
ట్విట్టర్‌లో
షాక్‌కు
గురైనట్టు
వ్యక్తం
చేస్తున్నారు.
అమితాబ్
బచ్చన్,
ప్రియాంక
చోప్రా,
విశాల్
దల్దాని,
కరణ్
జోహర్,
ఫర్హాన్
ఖాన్;
పరిణితి
చోప్రా
తమ
ట్వీట్ల
ద్వారా
తీవ్ర
దిగ్బ్రాంతిని,
సంతాపాన్ని
వ్యక్తం
చేశారు.
ప్రపంచవ్యాప్తంగా
బాలీవుడ్
అభిమానులు,
సంగీత
ప్రియులు
తమ
సంతాపాన్ని
వ్యక్తం
చేస్తూ..
ఆయన
ఆత్మకు
శాంతి
చేకూరాలి
అని
ప్రార్థించారు.