twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘నా సినిమాలు ప్లాప్ అయినా రూ. 100 కోట్లు వసూలు చేస్తాయి’’

    |

    నా సినిమాలు ప్లాప్ అయినా రూ. 100 కోట్లు వసూలు చేస్తాయంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. సొంత బేనర్ సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'లవ్ యాత్రి' ప్రమోషన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుష్ శర్మ, వారినా హుస్సేన్‌ జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతోంది.

    ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ... సినిమాల్లోకి వచ్చేందుకు ఆయుష్ శర్మ చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. నేను బంధుప్రీతి చూపుతున్నాను అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఆయన సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. రాజకీయ నాయకుడి కుమారుడు. అయినా సినిమా రంగంలో బంధుప్రీతి అనేది పని చేయదు. ఇక్కడ టాలెంట్ ఉన్న వారు మాత్రమే నటులుగా నిలదొక్కుకోగలరు అన్నారు.

    My flop films do business of over Rs 100 crore, says Salman Khan

    'ప్రేక్షకులకు నువ్వు ఎవరు? అనే విషయం అవసరం లేదు. నువ్వు అందంగా ఉన్నా, బాగా నటిస్తున్నా ఒక్కోసారి రిజెస్ట్ చేస్తారు. ఇది చాలా కాంప్లికేటివ్ ఫీల్డ్, ఇక్కడ ఇక్కడ సక్సెస్ అవ్వడం అంత సులభం కాదు. ఒక్కోసారి సినిమాలు ఎందుకు నిరాదరణకు గురవుతాయో కూడా అర్థం కాదు అని సల్మాన్ ఖాన్ అన్నారు.

    నేను నటించిన 'మైనే ప్యార్ కియా' సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు థియేటర్ వద్దకు నా ఫ్రెండుతో బైక్ మీద వెళ్లాను. ఇంటర్వెల్ సమయంలో వారు నన్ను చూసి నా వద్దకు రావడం మొదలు పెట్టారు. నేను వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాను. నేను వారికి నచ్చాను అని అర్థమైంది. అది నా జీవితంలో హ్యాపియెస్ట్ మూవెంట్ అని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.

    నేను చాలా అదృష్టవంతుడిని. నా సినిమాలు ప్లాప్ అయినా రూ. 100 కోట్లు వసూలు చేస్తాయి. ఇదే విషయం నేను ఆయుష్, వారినా హుస్సేన్ లకు చెప్పాను మీ సినిమా ప్లాప్ అయినా సరే బాక్సాఫీసు వద్ద రూ. 160 కోట్లు వసూలు చేయాలని, వారిలో సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఒత్తిడి అయితే ఉంది' అని సల్మాన్ అన్నారు.

    English summary
    Salman Khan has dismissed accusations of nepotism for launching his brother-in-law Aayush Sharma in the upcoming film, Loveyatri.The 52-year-old actor contends that someone would have launched Aayush, if not him, as he has been working hard for his Bollywood debut for years."I am one of the fortunate ones that even my flop films do business of over Rs 100 crore. I told Aayush and Warina that even if you deliver a flop film it should do Rs 160 crore at the box office.. So now they have pressure of flop film." Salman said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X