‘నా భర్త మంచోడు కాదు.. నాతో కంటే హీరోయిన్లతోనే ఎక్కువగా గడుపుతాడు’
బాలీవుడ్ స్టార్ యాక్టర్ గోవిందా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. అయితే ఆయన ఓ రకమైన డిప్రెషన్‌కు గురి కావడంతో ఆయన టీమ్ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గోవింద భార్య సునీతా ఆహుజా తాజా ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. తన భర్త గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఓ రకమైన సందిగ్ధంలో పడేశాయి. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య విభేదాలు ముదిరి తారాస్థాయికి చేరుకొన్నాయనే విషయం స్పష్టమైంది. జాతీయ మీడియాలో సునీతా అహుజా తాజా ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే..
గోవిందా, సునీత ప్రేమ వివాహం పెద్దలు, ఇరు కుటుంబాల అంగీకారంతో 1987లో జరిగింది. సుమారుగా 40 సంవత్సరాల దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది. అయితే ఇటీవల కాలంలో మరాఠీ హీరోయిన్‌తో గోవిందా చనువుగా, సన్నిహితంగా ఉండటం వారిద్దరి సంసారంలో డిస్ట్రబెన్స్ చోటు చేసుకొన్నది. అప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా జీవించడం మొదలుపెట్టారు. స్టార్ హీరో భార్యగా జీవించడం చాలా కష్టం అని తన భర్తపై తీవ్రమైన విమర్శలు చేశారు.

యుక్త వయసులో ఓ రకమైన తప్పులు చేస్తే వాటిని సరే అని ఒప్పుకొంటాం. కానీ వయసు పెరిగిన తర్వాత కూడా అలాంటి తప్పులే చేస్తే భరించడం కష్టం. ప్రతీసారి నా జీవిత భాగస్వామి ఏం చేస్తున్నాడో అని చెక్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటి తప్పులే గోవిందా చేశాడు. ఓ వయసు తర్వాత ఇలాంటి తప్పులు చేస్తే భరించడం కష్టం. మంచి భార్య, మంచి ఫ్యామిలీ, పిల్లలు ఉన్న తర్వాత కూడా మగవాళ్లు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారో అర్ధం కాదు అని ఆమె అన్నారు.
గోవిందాకు మరో హీరోయిన్‌తో అఫైర్ ఉందనే విషయం గురించి మీడియాకు నేను చాలాసార్లు చెప్పాను. మీరు విన్నట్టే.. నేను కూడా ఆ వార్తను విన్నాను. నా భర్తను మరో మహిళతో ఉన్న సమయంలో నేను ఎన్నడూ చూడలేదు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేదు. అలాంటప్పుడు నేను బహిరంగంగా ఎలా ఆరోపణలు చేయగలను. మరాఠీ నటితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్త నా వరకు వచ్చింది నిజమే అని సునీతా చెప్పారు.
గోవిందా సినిమా హీరో. ఆయన గురించి నేను ఏం చెప్పాలి. భార్యతో కంటే ఆయన హీరోయిన్లతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు. అలాంటి సమయాల్లో స్టార్ హీరో భార్య చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కొన్నిసార్లు నీ గుండెను రాయిగా చేసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవడానికి 38 దాంపత్య జీవితం తర్వాత అర్ధమైంది. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఇలాంటివి నాకు అర్ధం కాలేదు అని ఆమె ఎమోషనల్ అయ్యారు.
గోవిందా మంచి యాక్టర్. మంచి కొడుకు, మంచి సోదరుడు. కానీ మంచి భర్త కాదు. మరో జన్మ ఉంటే కూడా ఆయనను భర్తగా కోరుకోను. ఈ జీవితంలో భార్యగా ప్రేమను పొందలేకపోయాను. నేను చాలా విసిగిపోయాను అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విడాకుల కోసం ఆమె కోర్టు నోటీసులు కూడా గోవిందాకు పంపినట్టు వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











