నా ఫ్రెండే... ఎయిర్‌పోర్టులో వేధిస్తూ ప్రైవేట్ పార్టులపై చెయ్యేశాడు: పూజా భట్

నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణల తర్వాత పలువురు నటీమణులు, ఇతర రంగాలకు చెందిన మహిళలు తమకు ఎదురైన అలాంటి సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నటి, దర్శకురాలు పూజా భట్ గతంలో ఓసారి ఎయిర్‌పోర్టులో తన స్నేహితుడి ద్వారా ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన 'ఇండియా టుడే ఎన్ల్కేవ్ ఈస్ట్ 2018' సదస్సులో పూజా భట్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

 మీ శ్రతువులు మీ పక్కే ఉండొచ్చు

మీ శ్రతువులు మీ పక్కే ఉండొచ్చు

పూజా భట్ మాట్లాడుతూ... ‘కొన్నిసార్లు మీ శత్రువు మీ పక్కనే ఉంటారు. వేధింపులకు పాల్పడే వారు మీ స్నేహితులు కూడా అయుండొచ్చు ఉండొచ్చు. మహిళలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని అని పూజా భట్ వ్యాఖ్యానించారు.

నా వక్షోజాలు పట్టుకున్నాడు

నా వక్షోజాలు పట్టుకున్నాడు

ఓసారి ఎయిర్ పోర్టులో నా స్నేహితుడు నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. అతడు నన్ను వేధిస్తూ నా వక్షోజాలు పట్టుకున్నాడు. ఆ సమయంలో నేను తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను అని పూజా భట్ అన్నారు.

 అపుడు అసహనానికి గురయ్యాను

అపుడు అసహనానికి గురయ్యాను

మరో సందర్భంలో నా బాయ్ ఫ్రెండుతో రిలేషన్ షిప్‌లో ఉన్నపుడు అతడు నన్ను హింసించాడు. ఆ సమయంలో నేను అతడికి వ్యతిరేకంగా నా వాయిస్ రేజ్ చేశాను. కానీ కొందరు నా చర్యను తప్పుబట్టారు. నీ పర్సనల్ విషయాలు జనాల్లోకి తేవద్దని వారు చెప్పడం నన్ను మరింత అసహనానికి గురి చేసింది.. అని పూజా గుర్తు చేసుకునప్నారు.

ఇక్కడ అంతే....

ఇక్కడ అంతే....

బాలీవుడ్ లాంటి పరిశ్రమలో ఒక మహిళలకు అన్యాయం జరిగినపుడు సపోర్టు ఇవ్వడానికి చాలా మంది సంకోచిస్తారు. వేధింపులకు గురైన మహిళలకు నేను చెప్పేది ఒకటే. ఎవరికీ భయపడొద్దు. నిర్భయంగా వారిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించడానికి మగాళ్లు భయపడతారు అని పూజా భట్ అభిప్రాయ పడ్డారు.

 తనుశ్రీ దత్తా వ్యవహారంతో ధైర్యంగా ముందుకు

తనుశ్రీ దత్తా వ్యవహారంతో ధైర్యంగా ముందుకు

నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారంలో పలువురు స్టార్స్ నుండి ఈ మాజీ మిస్ ఇండియాకు మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో మీడియా చర్చా కార్యక్రమాల్లో పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి గుర్తు చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X