ఎన్నికల వేళ ఆ బూతు సీన్ గుర్తు చేస్తూ హీరోయిన్‌పై ట్రోలింగ్... ఘాటుగా రిప్లై!

Recommended Video

Swara Bhasker Trolled By Netizens, Actress Responds On The Trolls || Filmibeat Telugu

'వీరె ది వెడ్డింగ్' చిత్రంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ లైంగిక స్వయం తృప్తి పొందే సీన్ విషయంలో అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ చిత్రం గతేడాది విడుదలైతే... తాజాగా ఎన్నికల వేళ ఆ సీన్ గుర్తు చేస్తూ కొందరు ఆమెపై ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తనపై అభ్యంతకర కామెంట్లు చేసే వారిని, ట్రోల్ చేసే వారిని ఊరికే వదలి పెట్టకుండా ఘాటుగా రిప్లై ఇచ్చే స్వర భాస్కర్.... తాజాగా మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆ సీన్‍‌కు, ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు లింకు ఏమిటి... ఓ లుక్కేద్దాం.

మీ ఫింగర్ అందుకోసం కాదు.. దీనికోసం ఉపయోగించండి

మీ ఫింగర్ అందుకోసం కాదు.. దీనికోసం ఉపయోగించండి

‘‘ఇది ఎన్నికల సమయం... స్వర భాస్కర్ మాదిరిగా ప్రవర్తించండి.. మీ ఫింగర్ ఓటు వేయడానికి ఉపయోగించండి'' అంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. స్వర భాస్కర్ మాదిరిగా లైంగిక స్వయం తృప్తి పొందడానికి కాకుండా ఓటు వేయడానికి మీ వేలు ఉపయోగించండి అని అర్థం.

స్వర భాస్కర్ స్పందిస్తూ....

తనపై జరుగుతున్న ట్రోలింగ్ మీద స్వర భాస్కర్ రియాక్ట్ అయ్యారు. ‘వావ్.. నన్ను ట్రోల్ చేసే వారు చాలా కష్టపడుతున్నారు. మండే ఎండలో నిల్చుని నా పేరు బాగా పాపులర్ చేస్తున్నారు. మీరు చాలా డెడికేటెడ్.. స్వీట్' అని వ్యాఖ్యానించారు.

బాబూ ఆమె ఫింగర్ వాడలేదు, వైబ్రేటర్ వాడింది, అది బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్

ఈ వ్యవహారంలో కొందరు నెటిజన్లు స్వర భాస్కర్‌కు మద్దుతుగా నిలిచారు. ఆమె లైంగిక స్వయం తృప్తి పొందే సీన్లో ఫింగర్ వాడలేదు. వైబ్రేటర్ వాడింది. ఆ సీన్లను అంత తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అది బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లాంటిది అంటూ కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు.

అది మహిళల గురించి తీసిన సీన్

‘వీరె ది వెడ్డింగ్' చిత్రంలో మహిళలు లైంగిక స్వయం తృప్తి పొందే విధానం చూపించారు. అది సాధారణంగా జరిగే విషయమే. మహిళలకు ఆ హక్కు కూడా లేదు అనే ఆలోచించే వారే ఇలాంటి విమర్శలు చేస్తారు. మీ లాంటి వారు మారాల్సిన అవసరం ఉంది అనే ఓపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.

స్వర భాస్కర్

స్వర భాస్కర్

2018లో వచ్చిన ‘వీరె ది వెడ్డింగ్' మూవీ తర్వాత స్వర భాస్కర్ ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఈ మూవీ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేశారు. ఆమె పొలిటికల్ వ్యూస్ సైతం పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X