చాలీచాలని డ్రెస్‌లో సీరియల్ హీరోయిన్.. మత్తెక్కించే వీడియో వదిలిందిగా!
సాధారణంగా సినిమాల్లో నటించే హీరోయిన్లు మాత్రమే పాపులర్ అవుతూ ఉండేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని సీరియళ్లలో చేసే భామలు సైతం ఫుల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మౌనీ రాయ్ ఒకరు. సీరియల్ నటిగా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లను సైతం సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో బాడీ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా మౌనీ ఓ వీడియోను వదిలింది. అది మీరే చూడండి!
సినిమాలు - సీరియల్స్
మోడలింగ్ రంగంలో సత్తా చాటిన మౌనీ రాయ్ 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చి 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి ధారావాహికల్లోనూ నటించింది.

నాగిన్‌తో సంచలనంగా
సీరియల్ నటిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మౌనీ రాయ్.. అవి వేరే భాషల్లోకి కూడా డబ్బింగ్ అవడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆమె 'నాగిన్' అనే సీరియల్ ద్వారా బిగ్ సెలెబ్రిటీ అయింది. అంతలా ఇది ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇదే సీరియల్ తెలుగులోకి కూడా వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

విలన్‌గా కిక్.. వరుసగా
కెరీర్ ఆరంభంలోనే నటిగా మౌనీ రాయ్ చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా హీరోయిన్‌గా 'హీరో హిట్లర్ లవ్', 'గోల్డ్', 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీలు చేసింది. ఇక, గత ఏడాది మౌనీ రాయ్ 'బ్రహ్మాస్త్ర'లో విలన్‌గా చేసి ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయని చెప్పుకోవాలి.
భర్తతో ఫుల్ ఎంజాయ్
సుదీర్ఘ కాలంగా అటు సినిమాల్లోనూ, ఇటు సీరియళ్లలోనూ నటిస్తూ సత్తా చాటుతోన్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో ఎందరితోనో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో లవ్‌లో పడింది. అలాగే, గత ఏడాదే అతడిని వివాహం చేసుకుంది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

ఎప్పుడూ అందులోనే
దాదాపు రెండు దశాబ్దాలుగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేసేస్తోంది.
బాడీ షోతో కవ్విస్తోంది
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ బాడీ షో చేస్తూ విపరీతంగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం తరచూ వదులుతోంది. ఈ మధ్య కాలంలో అయితే డోస్ పెంచేసి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా మౌనీ రాయ్ తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటూ సెన్సేషన్ అవుతోంది.
మౌనీ వీడియో వైరల్
మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు అతి చిన్నదైన డ్రెస్‌లో దర్శనమిచ్చింది. అంతేకాదు, ఇందులో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తోన్నాయి. దీంతో మౌనీ రాయ్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











