హిందీ మార్కెట్ పై సైలెంట్ గా ఫోకస్ పెడుతున్న నాగ చైతన్య.. అస్సలు టెంప్ట్ అవ్వడం లేదు..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టోరీలో స్టార్ హీరోల ఫ్యామిలీ కి చెందిన కొంతమంది యువ నటులు అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపు అందుకోలేదు. ముఖ్యంగా అక్కినేని వారి కుటుంబంలో నాగార్జున తర్వాత నలుగురు హీరోలు వెండితెరపై వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు మేనల్లుడు సుమంత్ అలాగే అల్లుడు సుశాంత్, కొడుకు అఖిల్ సరైన ట్రాక్ లోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య అయితే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతను సెలెక్ట్ చేసుకున్న సినిమాలు భారీ ఓపెనింగ్స్ తో మంచి క్రేజ్ ను అందిస్తున్నాయి.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం చాలా మంది హీరోలు మిగతా భాషల్లో కూడా మార్కెట్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాన్ ఇండియా అంటూ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక మరికొందరు బైలాంగ్యువల్ చిత్రాలు అంటూ కూడా హడావుడి చేసేస్తున్నారు. అయితే నాగచైతన్య మాత్రం అందరి కంటే కాస్త తెలివిగా విభిన్నమైన తరహాలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Naga chaitanya special focus on hindi market

అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాపై అయితే అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో అక్కడ నాగచైతన్య ఎక్కువగా హైలెట్ చేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర యూనిట్ మాత్రమే కాకుండా చైతన్య తన పర్సనల్ టీమ్ ద్వారా కూడా అక్కడి మీడియాలో హైలెట్ అయ్యేలా ముందుకు సాగుతున్నాడు. లాల్ సింగ్ చద్దా సినిమా తో పాటు నాగచైతన్యకు మరికొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఆ సినిమాలో నాగచైతన్య పై అమీర్ ఖాన్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన లోకేషన్ స్టిల్స్ లో కూడా నాగచైతన్య చిత్రం యూనిట్ సభ్యులతో చాలా క్లోజ్ అయినట్లు అర్థం అవుతోంది. ఇంకా మరి కొంతమంది దర్శకులు స్టార్ హీరో నాగచైతన్యకు స్పెషల్ రోల్స్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం అయితే నాగచైతన్య మాత్రం కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

Naga chaitanya special focus on hindi market

ఇక మెల్లగా హిందీ లో తన క్రేజ్ ను పెంచుకొని వీలైతే హీరోగా కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో లో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బంగార్రాజు సినిమాలో కూడా తండ్రి తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మరి ఆ రెండు సినిమాలు కూడా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X