Sridevi death శ్రీదేవీ ఆరోగ్య సమస్యలు నాగార్జునకు ముందే తెలుసా? బోని కపూర్‌కు మన్మథుడు షాకింగ్ విషయాలు
అందాల తార శ్రీదేవీ మరణం గురించి భర్త బోనికపూర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆమె మరణంపై అభిమానులు, సినీ వర్గాల్లో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చేందుకు బొని కపూర్ చాలా సంవత్సరాల తర్వాత పెదవి విప్పారు. శ్రీదేవీ అనారోగ్యం గురించి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని చెప్పిన విషయాలను ఆయన బయటపెట్టడం సంచలనంగా మారింది. శ్రీదేవీ మరణం గురించి నాగార్జున అక్కినేని చెప్పిన విషయాలు, శ్రీదేవీ మరణానికి గల కారణాలను బోని కపూర్ వెల్లడిస్తూ..
శ్రీదేవీ మరణించే సమయానికి ఆమె ఫుల్ డైటింగ్‌లో ఉంది. అందాన్ని కాపాడుకోవడానికి, నాజుకుగా కనిపించడానికి శ్రీదేవీ ఎక్కువగా ఉపవాసాలు చేసేది. ఎప్పుడు తన శరీరాకృతిని మెయింటెన్ చేయడానికి, స్క్రీన్‌పై అందంగా కనిపించడానికి డైటింగ్ చేసేది. నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందే మెదడులో కొన్ని సమస్యలు ఉండేవి. వాటి వల్ల కిందపడిపోయేది అని బోని కపూర్ చెప్పారు.

శ్రీదేవీ ఎక్కువగా డైటింగ్ చేయడం వల్ల లో బీపీ సమస్యతో బాధపడేవారు. అయితే ఓసారి శ్రీదేవీ అనారోగ్యంతో కిందపడిపోయారని నాగార్జున చెప్పారు. శ్రీదేవీ మరణం తర్వాత పరామర్శించడానికి వచ్చి.. నా భార్య గురించి కొన్ని దిగ్బ్రాంతికరమైన విషయాలు చెప్పారు. ఓ షూటింగు సమయంలో శ్రీదేవీ బాత్రూంలో పడిపోయారు. ఆ సమయంలో ఆమె పన్ను కూడా విరిగిపోయింది అని నాగార్జున చెప్పడం నాకు షాకింగ్‌గా అనిపించింది.

నా పెళ్లికి ముందే శ్రీదేవీ ఆహార అలవాట్లు నాకు బాగా తెలుసు. పెళ్లి తర్వాత ఆమె అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించాను. డాక్టర్లు కూడా ఆమెకు సలహాలిస్తూ.. భోజనంలో ఉప్పు ఉండేలా చూసుకోమని చెప్పారు. తగినంత ఉప్పును ఆహరంలో ఉండేలా చూసుకోమని చెప్పారు. అయితే డాక్టర్ల సలహాలను ఆమె సీరియస్‌గా తీసుకోకపోవడం దురదృష్టకరం. అయితే శ్రీదేవి మరణం వరకు కూడా ఆమె అలవాట్లు ఎంత ప్రమాదకరమో తెలియలేదు అని బోని కపూర్ ఆవేదన చెందారు.
తమ కుటుంబంలో జరిగే పెళ్లి కోసం దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులను, సినీ వర్గాలను షాకింగ్‌లో ముంచెత్తింది. ఫిబ్రవరి 24 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఆమె మరణించడం సంచలనంగా మారింది. అయితే ఆమె మరణంపై వస్తున్న అనేక అనుమానాలకు తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోని కపూర్ వివరణ ఇవ్వడంతో ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











