»   » బ్రేకింగ్.. బాలీవుడ్ చిత్రంలో నాగార్జున.. సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో మన్మధుడు!

బ్రేకింగ్.. బాలీవుడ్ చిత్రంలో నాగార్జున.. సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో మన్మధుడు!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Nagarjuna Talks About Brahmastra Movie

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అడుగుపెట్టబోతున్నారు. గతంలో శివ, క్రిమినల్ ఖుదాగవా లాంటి పలు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నాగార్జున నటించనున్నారు. త్వరలోనే చిత్ర బృందంతో చేరబోతున్నారు.

    15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు

    15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు

    బ్రహ్మస్త్ర చిత్రం గురించి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నేను బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నాను. సుమారు 15 ఏళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం జరుగుతున్నది. చివరిగా నేనే ఏ బాలీవుడ్ చిత్రంలో నటించానో నాకే గుర్తు లేదు. మహేష్ భట్ రూపొందించిన జఖ్మ్ చిత్రం అనుకొంటా అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

     ఎల్‌వోసీ చిత్రంలో చివరిసారిగా

    ఎల్‌వోసీ చిత్రంలో చివరిసారిగా

    బాలీవుడ్‌లో మీ చివరి చిత్రం ఎల్‌వోసీ అని చెప్పగా.. అవును హిందీలో నా చివరి చిత్రం ఎల్‌వోసీనే. అందులో నాది అతిథి పాత్ర. జఖ్మ్ మాత్రం నేను ఫుల్‌లెంగ్త్ చేసిన పాత్ర. మహేష్‌భట్ రూపొందించిన చిత్రానికి అలియాభట్ వచ్చేది. అప్పుడు చాలా చిన్నపిల్ల అని నాగ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎదిగిపోయింది. సమయం ఎలా గడిచిందో తెలియడం లేదు అని నాగార్జున అన్నారు.

    అమితాబ్ జీ ఒక్కరే తెలుసు

    అమితాబ్ జీ ఒక్కరే తెలుసు

    బ్రహ్మస్త్రలో నటించే వాళ్లలో నాకు తెలిసింది కేవలం అమితాబ్ బచ్చన్ జీ మాత్రమే. మిగితా వారందరూ నాకు కొత్తనే. కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ, అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌తో నేను తొలిసారి నటిస్తున్నాను.

    బ్రహ్మస్త్ర కథ నచ్చడంతో వెంటనే

    బ్రహ్మస్త్ర కథ నచ్చడంతో వెంటనే

    తెలుగులో బిజీగా ఉండటం వల్లనే బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదు. హిందీ చిత్రాల్లో నటించకూడదనే ఉద్దేశం లేదు. కథ మంచిగా ఉంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధం. బ్రహ్మస్త్ర చిత్ర కథ నాకు బాగా నచ్చింది. కథ చెప్పగానే మరోసారి ఆలోచించకుండా వెంటనే ఒప్పుకొన్నాను. బ్రహ్మస్త్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తున్నాను అని నాగార్జున తెలిపారు.

    భారీ బడ్జెట్‌తో బ్రహ్మస్త్ర

    భారీ బడ్జెట్‌తో బ్రహ్మస్త్ర

    బ్రహ్మస్త్ర చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు నాగార్జున యూరప్‌కు బయలుదేరి వెళ్లారు. పది రోజులపాటు ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు.

    దేవదాసు చిత్రంలో నానితో

    దేవదాసు చిత్రంలో నానితో

    తెలుగులో నానితో కలిసి దేవదాసు అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరెక్టర్. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Nagarjuna again doing a bollywood film. He said: “Yes, I am doing ‘Brahmastra‘. It is my first Hindi film in a very long time. I can’t remember when was the last time I did a Hindi film. Except Amitji (Amitabh Bachchan) with whom I’ve worked in ‘Khuda Gawah‘, they are all new to me. I’m working for the first time with Karan Johar, (director) Ayan Mukherjee, Alia Bhatt and Ranbir Kapoor.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more