Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బ్రేకింగ్.. బాలీవుడ్ చిత్రంలో నాగార్జున.. సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో మన్మధుడు!
Recommended Video
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అడుగుపెట్టబోతున్నారు. గతంలో శివ, క్రిమినల్ ఖుదాగవా లాంటి పలు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నాగార్జున నటించనున్నారు. త్వరలోనే చిత్ర బృందంతో చేరబోతున్నారు.
15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు
బ్రహ్మస్త్ర చిత్రం గురించి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నేను బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నాను. సుమారు 15 ఏళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం జరుగుతున్నది. చివరిగా నేనే ఏ బాలీవుడ్ చిత్రంలో నటించానో నాకే గుర్తు లేదు. మహేష్ భట్ రూపొందించిన జఖ్మ్ చిత్రం అనుకొంటా అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఎల్వోసీ చిత్రంలో చివరిసారిగా
బాలీవుడ్లో మీ చివరి చిత్రం ఎల్వోసీ అని చెప్పగా.. అవును హిందీలో నా చివరి చిత్రం ఎల్వోసీనే. అందులో నాది అతిథి పాత్ర. జఖ్మ్ మాత్రం నేను ఫుల్‌లెంగ్త్ చేసిన పాత్ర. మహేష్‌భట్ రూపొందించిన చిత్రానికి అలియాభట్ వచ్చేది. అప్పుడు చాలా చిన్నపిల్ల అని నాగ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎదిగిపోయింది. సమయం ఎలా గడిచిందో తెలియడం లేదు అని నాగార్జున అన్నారు.
అమితాబ్ జీ ఒక్కరే తెలుసు
బ్రహ్మస్త్రలో నటించే వాళ్లలో నాకు తెలిసింది కేవలం అమితాబ్ బచ్చన్ జీ మాత్రమే. మిగితా వారందరూ నాకు కొత్తనే. కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ, అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌తో నేను తొలిసారి నటిస్తున్నాను.
బ్రహ్మస్త్ర కథ నచ్చడంతో వెంటనే
తెలుగులో బిజీగా ఉండటం వల్లనే బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదు. హిందీ చిత్రాల్లో నటించకూడదనే ఉద్దేశం లేదు. కథ మంచిగా ఉంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధం. బ్రహ్మస్త్ర చిత్ర కథ నాకు బాగా నచ్చింది. కథ చెప్పగానే మరోసారి ఆలోచించకుండా వెంటనే ఒప్పుకొన్నాను. బ్రహ్మస్త్ర షూటింగ్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తున్నాను అని నాగార్జున తెలిపారు.
భారీ బడ్జెట్‌తో బ్రహ్మస్త్ర
బ్రహ్మస్త్ర చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు నాగార్జున యూరప్‌కు బయలుదేరి వెళ్లారు. పది రోజులపాటు ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటారు.
దేవదాసు చిత్రంలో నానితో
తెలుగులో నానితో కలిసి దేవదాసు అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరెక్టర్. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.