మళ్లీ ప్రేమలో నాగార్జున హీరోయిన్.. బ్రేకప్ తర్వాత విషాదం నుంచి..
బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అందాల సుందరిగా ఆకట్టుకొన్నది పూజా బాత్రా. తెలుగులో నాగార్జున, తమిళంలో అజిత్‌తో కలిసి ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో సిసింద్రీ, గ్రీకువీరుడు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అయితే కెరీర్ పీక్‌లో ఉండగానే పూజా బాత్రా పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగమ్మ మళ్లీ ప్రేమలో పడిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆమె తాజా ప్రియుడు ఎవరంటే..

2002లో పెళ్లి చేసుకొని
2001లో పూజా బాత్రా కెరీర్ పీక్‌లో ఉండేది. నాయక్, జోడి నంబర్ 1 లాంటి చిత్రాలతో క్రేజీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకొన్నది. ఆ సమయంలో డాక్టర్ సోను ఎస్ అహ్లువాలియాను 2002 పెళ్లి చేసుకోవడం సెన్సేషన్‌గా మారింది. లాస్ ఎంజెలెస్‌లో కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని కొనసాగించింది. అయితే వివాహం తర్వాత ఆమె జీవితంలో కలతలు చోటుచేసుకోవడంతో డిప్రెషన్‌కు లోనయ్యారనే వార్తలు వినిపించాయి.

2011లో విడాకులతో షాక్
పూజా బాత్రా, భర్త అహ్లువాలియాతో విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరికి మరొకరు దూరమయ్యారు. చివరకు 2011లో అహ్లువాలియాతో పూజా విడాకులు తీసుకొన్నారు. అనంతరం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి కెరీర్‌పై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో మళ్లీ ప్రేమలో పడింది.

కొత్తగా మళ్లీ ప్రేమలో పడిన బ్యూటీ
ప్రస్తుతం పూజా బాత్రా జీవితంలోకి కొత్త ప్రియుడు ప్రవేశించాడు. టైగర్ జిందా హై చిత్రంలో నటించిన నవాబ్ షాతో ప్రేమలో పడింది. వారిద్దరూ కలిసి విహార యాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో కేకపెట్టిస్తున్నారు. ప్రస్తుతం పూజా జీవితం రంగుల మయంగా ఉందంట. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గుప్పుమంటున్నాయి.

ప్రియా లవర్ భావోద్వేగం
మీడియా వార్తలకు తగినట్టుగానే.. నవాబ్ షా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ప్రేయసితో నా హృదయం తోడు కోరుకోవడానికి 46 ఏళ్లు పట్టింది. నా ఆత్మబంధువులందరికీ ఈద్ ముబారక్. మీరందరూ ఎప్పటిలానే నాకు అండగా ఉండాలి అంటూ నవాబ్ షా పోస్టులో పేర్కొన్నారు. పూజాతో పెళ్లి ఎప్పుడనే విషయాన్ని మాత్రం గుట్టుగా ఉంచుతున్నాడు.

తమిళ చిత్రాలతో బిజీగా
పూజా బాత్రా కెరీర్ విషయానికి వస్తే, తమిళంలో గజేంద్ర, బోస్, యాన్ అనే చిత్రాల్లో నటిస్తున్నది. హిందీలోనూ చిన్నాచితక అవకాశాలతో రాణిస్తున్నది. పంజాబీ చిత్ర పరిశ్రమలోనూ ఆఫర్లను అందిపుచ్చుకొంటున్నది. కొన్ని చిత్రాలకు సంబంధించిన ఆఫర్లపై చర్చలు జరుగుతున్నట్టు మీడియా వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











