అక్రమ ఆయుధాల కేసు.. వర్మపై మండిపడిన సంజయ్ దత్ సొదరి!
వివాదాలలో చిక్కుకోవడం వర్మకు అలవాటే. ఇటీవల రాజ్ కుమార్ హిరానీ తెరక్కించిన సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎమోషనల్ గా ఈ చిత్రం అందిరికి కనెక్ట్ అయింది. కానీ వివాదాస్పద దర్శకుడు వర్మకు మాత్రం ఈ చిత్రం నచ్చలేదు.
ఈ చిత్రంలో నిజాలు చూపించలేదని, వాస్తవాలు బయట పెట్టే విధంగా తాను మళ్ళీ సంజయ్ దత్ బయోపిక్ చిత్రం తీస్తానని వర్మ ఇటీవల ప్రకటించాడు. సంజయ్ దత్జీవితాన్ని కుదిపేసిన అక్రమాయుధాల కేసు గురించే తన చిత్రం ఉంటుందని ప్రకటించాడు.

దీనిపై సంజయ్ దత్ సోదరి నమ్రత దత్ స్పందించారు. రామ్ గోపాల్ వర్మపై మండిపడ్డారు. అక్రమాయుధాల కేసు తమ కుటుంబంలో ఓ బాధాకర విషయం. దాని గురించి మళ్ళీ ఎందుకు సినిమా తీయాలని భావిస్తున్నారు. మమ్మల్ని తిరిగి భాద పెట్టాలని భావిస్తున్నారా అంటూ నమ్రత స్పందించింది. నమ్రత దత్ వ్యాఖ్యలకు వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











