ఆమె డేరింగ్ లేడి.. త్వరలో నార్మల్ లైఫ్‌లోకి వస్తుంది.. మహేష్ సతీమణి నమ్రత!

Recommended Video

Namrata Shirodkar Visits Sonali Bendre In New York

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికా వెకేషన్ లో ఉన్నాడు. మహర్షి చిత్ర షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. షూటింగ్ కు గ్యాప్ రావడంతో మహేష్ తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో సరదాగా అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో విహరించారు. మహేష్ తో వివాహం కాకముందు నమ్రత పలు బాలీవుడ్, తెలుగు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో కూడా నమ్రతకు చాలామంది స్నేహితులు ఉన్నారు. స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేతో కూడా నమ్రతకు మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా నమ్రత క్యాన్సర్ బారీన పడ్డ సోనాలి బింద్రేని కలసి పరామర్శించింది.

కోలుకుంటున్న సోనాలి బింద్రే

కోలుకుంటున్న సోనాలి బింద్రే

తనకు హైగ్రేడ్ క్యాన్సర్ సోకిందని చాలా రోజులు క్రితం సోనాలి ప్రకటించిన సమయంలో సినీ ప్రముఖులంతా షాక్ కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆరోగ్యంగా ఉండే సోనాలికి క్యాన్సర్ ఏంటి అంటూ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోనాలి బింద్రే న్యూయార్క్ నగరంలో చికిత్స పొందుతోంది.

క్యూకట్టిన స్నేహితులు

క్యూకట్టిన స్నేహితులు


సోనాలి బింద్రేని పరామర్శించడం కోసం చాలామంది సినీ ప్రముఖులు ఆమె స్నేహితులు అమెరికాకు క్యూ కట్టారు. తన బెస్ట్ ప్రెండ్ ని పరామర్శించడం కోసం సునాన్నే ఖాన్ అమెరికా వెళ్లి సోనాలిని కలసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రియాంక చోప్రా, రిషి కపూర్, నీతూ కపూర్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులంతా సోనాలిని కలసి త్వరగా కోలుకోవాలని విష్ చేశారు.

ఇప్పుడు నమ్రత వంతు

ఇప్పుడు నమ్రత వంతు

ప్రస్తుతం మహేష్ తో,పిల్లలతో నమ్రత అమెరికాలోనే ఉంది. వెకేషన్ పూర్తి కాగానే నమ్రత సొనాలికి కలిసింది. సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని, తన ప్రార్థనలు నీతోనే ఉంటాయని ధైర్యం చెప్పింది. క్యాన్సర్ ఎలా సోకింది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది వంటి విషయాలని ఆరా తీసి సోనాలి బింద్రే ద్వారా తెలుసుకుంది.

ఆమె డేరింగ్ లేడి

ఆమె డేరింగ్ లేడి


సోనాలి బింద్రేని కలసిన అనంతరం నమ్రత మాట్లాడుతూ.. సోనాలి బింద్రే చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. త్వరలోనే నార్మల్ లైఫ్ లోకి వస్తుందని భావిస్తున్నాను అంటూ నమ్రత తెలిపింది. ఈ సారి తాను సొనాలిని కలిసే సమయానికి ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉండాలని భావిస్తున్నట్లు నమ్రత కోరుకుంది.

మహేష్ బాబుతో కూడా

మహేష్ బాబుతో కూడా

సూపర్ స్టార్ మహేష్ తో కూడా సోనాలి బింద్రేకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ కలసి మురారి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సోనాలి బింద్రే తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్, మన్మధుడు, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X