నానా పాటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వలేదు: తనుశ్రీ దత్తా

2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' మూవీ షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు నానా పాటేకర్ తనను వేధింపులకు గురి చేశాడంటూ బాలీవుడ్ నటించి తనుశ్రీ దత్తా గతేడాది #మీటూ ఉద్యమంలో భాగంగా బయటపెట్టడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావడం లేదు.

సరైన సాక్ష్యాలు లేవనే కారణంగా పోలీసులు నానా పాటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారంటూ తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై తనుశ్రీ దత్తతా స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు, తమ లాయర్ నితిన్‌కు కూడా ఈ విషయం స్పష్టం చేశారన్నారు.

Nana Patekar Didnt Get A Clean Chit By Cops: Tanushree Dutta

నానా పాటేకర్ పబ్లిక్ రిలేషన్ టీమ్ కావాలనే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తోందని తనుశ్రీ దత్తా వెల్లడించారు. అతడి వేధింపుల విషయం తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరూ అతడికి పని ఇవ్వడం లేదు, తన పబ్లిక్ ఇమేజ్ కాపాడుకోవడానికే నానా పాటేకర్ తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు తెలిపారు.

మరో వైపు ఈ కేసు విషయమై సీనియర్ పోలీస్ ఆఫీసర్ శేలేష్ పసల్వాద్ మిడ్ డే పత్రికతో మాట్లాడుతూ... 'ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొసాగుతోందని, ఈ సమయంలో తాను ఎలాంటి కామెంట్ చేయదలుకోలేదు' అన్నారు.

ఇండియాలో #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ప్రధాన కారణం తనుశ్రీ దత్తా. నానా పాటేకర్ మీద ఆమె చేసిన ఆరోపణలు బాలీవుడ్ ఇండస్ట్రీలో గతేడాది ప్రకంపణలు సృష్టించింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో పాటేకర్ తనను వేధింపుకు గురి చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X