»   » నానా పాటేకర్ దుర్మార్గుడు: సీనియర్ నటి ఓల్డ్ వీడియో వైరల్

నానా పాటేకర్ దుర్మార్గుడు: సీనియర్ నటి ఓల్డ్ వీడియో వైరల్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  నానా పాటేకర్ దుర్మార్గుడు: సీనియర్ నటి ఓల్డ్ వీడియో వైరల్

  బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ... పదేళ్ల క్రితం సినిమా షూటింగులో జరిగిన సంఘటన గురించి తనుశ్రీ దత్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. తనలాగే ఎంతో మందిని అతడు వేధించాడని, అతడి ప్రవర్తన గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా ఎవరూ అతడి గురించి మాట్లాడటానికి సాహసించరు. అతడికి ఒక రాజకీయ పార్టీ అండ ఉండటంతో అంతా అతడికి భయపడుతుంటారు, వారి పార్టీ మనుషులతో తన కారుపై దాడి చేయించారని తనుశ్రీ దత్త వెల్లడించారు.

  ఈ నేపథ్యంలో నానా పాటేకర్ మీద 8 ఏళ్ల క్రితం సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. 2010లో డింపుల్ నటించిన 'తుమ్ మిలో తో సహి' సినిమా విడుదల సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.

  నానా పాటేకర్ దుర్మార్గుడు

  నానా పాటేకర్ దుర్మార్గుడు

  నానా పాటేకర్ ఏమైనా మారిరా? ఇంకా అలాగనే ఉన్నారా? అని డింపుల్‌ను అనుపమ చోప్రా ప్రశ్నించగా... ‘అతడు దుర్మార్గుడు.' అంటూ సమాధానం ఇచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం నానా పాటేకర్ గురించి డింపుల్ అన్న వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయంది.

  గొప్ప నటుడే కానీ... అతడికి చీకటి కోణం ఉంది

  గొప్ప నటుడే కానీ... అతడికి చీకటి కోణం ఉంది

  నానా పాటేకర్ గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి ఒక చెడు అద్యాయం ఉంటుంది అని డింపుల్ కపాడియా అప్పటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  అతడి టాలెంట్ చూస్తే హత్యలు చేసినా క్షమించాలనిపిస్తుంది

  అతడి టాలెంట్ చూస్తే హత్యలు చేసినా క్షమించాలనిపిస్తుంది

  ఈ వీడియోలో డింపుల్... నానా పాటేకర్ టాలెంట్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. "అతడి టాలెంట్ చూశాక.... వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది.'' అంటూ వ్యాఖ్యానించారు.

  నానా పాటేకర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  తనుశ్రీ దత్త సంఘటన తర్వాత ఇంతకాలం నానా పాటేకర్ ఏం చేసినా భరించిన పలువురు నటులు అతడికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అతడికి సంబంధించిన పలు పాత వీడియోలు సైతం మళ్లీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.

  English summary
  An eight year old NDTV interview of Dimple Kapadia has resurfaced on the web, where she is seen talking about Nana's 'dark side'. The interview was done ahead of the release of their 2010 film 'Tum Milo Toh Sahi'. When asked whether he has 'mellowed out or is he even more stuck in his ways', Dimple responds, "I think he is obnoxious."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more