Hi Nanna 4 Days Collections: సండే నాని ఊచకోత.. అప్పుడే అన్ని కోట్లు ఔట్.. హిట్ కావాలంటే మాత్రం!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన సహజసిద్ధమైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ నేచురల్ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు నాని. గతంలో కంటే ఇప్పుడు తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలనే చేస్తోన్న అతడు.. తాజాగా 'హాయ్ నాన్న' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'హాయ్ నాన్న' సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!
నాని నుంచి ఫీల్ గుడ్ మూవీ:నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు పోషించారు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?:నాని 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.
4వ రోజు తెలుగులో వసూళ్లు:'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు అతి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో రూ. 4.16 కోట్లు షేర్, రూ. 7.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి ఎంతంటే:'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.71 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, కృష్ణాలో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో రూ. 12.91 కోట్లు షేర్, రూ. 23.30 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 12.91 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.11 కోట్లు షేర్, రూ. 40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఎమోషనల్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 21.11 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 7.39 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
ఒకరోజుకు మించి ఒకరోజు:నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఒకరోజుకు మించి ఒకరోజు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం మూడో రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 5.70 కోట్లు వసూలు చేసింది. ఇక, నాలుగో రోజు అయితే ఏకంగా రూ. 6.36 కోట్లు రాబట్టింది. అలాగే, వీక్ డేస్‌లో కూడా మంచి హోల్డ్ కనబరిస్తే ఈ చిత్రం వారంలోనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











